- Telugu News Photo Gallery Sports photos Ishan kishan shone in his t20i debut and smashed 56 off just 32 balls
India vs England: అరంగేట్ర మ్యాచ్‌లోనే దంచికొట్టేశాడు.. కెప్టెన్ అండతో దుమ్ములేపాడు.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పవర్ చూపించాడు
Ind vs Eng: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్దుమ్మురేపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో విరుచుకుపడ్డాడు. భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Updated on: Mar 15, 2021 | 9:10 AM

అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్మెరుపులు మెరిపించాడు. అహ్మదాబాద్నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్ఇండియా ఘన విజయానికి కారణంగా మారాడు.

ఇషాన్ కిషన్

అరంగేట్రం మ్యాచ్ అయినప్పటికీ స్వేచ్ఛగా షాట్లు ఆడిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

జోప్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు.

భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

సామ్ కరన్ వేసిన తొలి ఓవర్లే.. కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఓపెనర్ కేఎల్ రాహుల్(0). అప్పటికి భారత్ కూడా ఇంకా ఖాతా తెరవలేదు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(73*)తో ఇషాన్ కిషన్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.




