Gold Price Today: తగ్గిన బంగారం ధరలు… శనివారం దేశ వ్యాప్తంగా 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతంటే..
Gold Price Today: లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఇక గతకొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా..
Gold Price Today: లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఇక గతకొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా.. శనివారం మళ్లీ తగ్గింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో ఓసారి తెలుసుకుందాం.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర శుక్రవారంతో పోల్చితే రూ.100 తగ్గి 10 గ్రాముల బంగారం రూ.44,250 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర 110 రూపాయలు తగ్గి రూ. 48,270గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ తగ్గుదల ఢిల్లీ కంటే ఎక్కువగా ఉంది. శుక్రవారం ముంబయిలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.210 తగ్గి రూ. 44,070గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,070 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 45,930 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 42,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 45,930గా ఉంది. సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,100గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,930గా ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో మరో ముఖ్య నగరమైన చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 42,490 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,350 వద్ద కొనసాగుతోంది.