Salary Hike: ఆరు నెలల్లోనే రెండోసారి ఇంక్రిమెంట్ ప్రకటించిన టీసీఎస్.. ఆశ్చర్యంలో ప్రైవేటు సంస్థలు..
TCS announces salary hike: కరోనావైరస్ కారణంగా చాలా కంపెనీలన్నీ మూతబడ్డాయి. చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికీ కోలుకోలేనీ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు దినదిన గండంగా
TCS announces salary hike: కరోనావైరస్ కారణంగా చాలా కంపెనీలన్నీ మూతబడ్డాయి. చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికీ కోలుకోలేనీ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు దినదిన గండంగా కాలాన్నీ వెళ్లదీస్తూన్నాయి. ఈ క్రమంలో ఐటీ సర్వీసెస్ మేజర్ కంపెనీ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సంస్థలో పనిచేస్తున్న వారికి జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 ఏప్రిల్ నుంచి జీతాల పెంపు అమల్లోకి వస్తుందని టీసీఎస్ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. అయితే ఆరు నెలల్లోనే టీసీఎస్ సంస్థ రెండో సారి ఇంక్రిమెంట్లను ప్రకటించడంపై ఆ సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అంతకుముందు 2020 అక్టోబరులో టీసీఎస్ 6-8 శాతం ఇంక్రిమెంట్‌ను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఇంక్రిమెంట్లతో సంస్థలో పనిచేసే వారికి 12-14 శాతం వరకు లబ్ధిచేకూరనుందని పేర్కొంటున్నారు. తాజాగా ప్రకటించిన ఇంక్రిమెంట్‌తో 469,000 మంది ఉద్యోగులకు లాభం చేకూరనుందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. తమ బెంచ్ మార్కుకు అనుగుణంగా.. అసోసియేట్లకు ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థ స్థిరంగా.. అనూకూలంగా పయనించేలా అందరూ కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే.. పీర్ యాక్సెంచర్ సంస్థ కూడా మార్చి 18న ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది.
ఇదిలాఉంటే.. దేశ జిడిపికి ఐటీ రంగం 8శాతం తోడ్పాడునందించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం పేర్కొన్నారు. 2019 నుంచి ఈ రంగంలో రెండు లక్షల కొత్త ఉద్యోగాలు పెరిగాయని తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా.. ప్రపంచంలోనే భారత్ మెరుగైన ఘనతను సాధిస్తోందని రాజ్యసభలో వెల్లడించారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో టీసీఎస్ మొదటిగా ఇంక్రిమెంట్లను ప్రకటించిన ఐటీ కంపెనీగా నిలిచింది. దీనిపై ప్రైవేటు సంస్థలు ఆశ్చర్యాన్ని వ్యక్తచేస్తుండగా.. ఉద్యోగులు మాత్రం తమ కంపెనీలు కూడా పెంచుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు.
Also Read: