PM Kisan: రైతులకు అలర్ట్.. ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి అకౌంట్లోకి రూ.4000.. ఎలా అంటే..
PM Kisan Yojana: రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం వారి ఖాతాకు
PM Kisan Yojana: రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం వారి ఖాతాకు ఏటా ఆరు వేల రూపాయల సహాయం ఇస్తుంది. ఈ మొత్తాన్ని రైతులు మూడు విడతలుగా పొందుతారు. అంటే వారికి రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు మరియు మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు వస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలోకి 7 విడతల డబ్బులను అందించింది. ఇక 8వ విడతల డబ్బులను అందించేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. ఇక డబ్బులను ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో రైతుల అకౌంట్లలో వేయనుంది.
ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మార్చి 31 లోపు ఈ పథకం కింద నమోదు చేసుకోవాలి. మీరు ఇలా చేస్తే, ఎనిమిదవ విడతతో మీ ఖాతాకు రెండు వేల రూపాయలు వస్తాయి. మార్చి 31 లోగా నమోదు చేసుకుంటే, మీ ఖాతాకు నాలుగు వేల రూపాయలు వస్తాయి. అది ఎలాగంటే.. ఒక రైతు నమోదు చేసుకున్నప్పుడల్లా, ప్రభుత్వం అతనికి ఒకేసారి రెండు వాయిదాలను అందిస్తుంది. కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. (PM Kisan Samman Nidhi)
అయితే ఈ డబ్బులు వచ్చే ముందు మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు. కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేయబడతాయి. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. మీకు ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకొని బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్టేట్, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి మీ పేరు ఆ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీఎం కిసాన్ స్కీంలో చేరకపోతే.. ఇప్పుడు కూడా ఆన్ లైన్ లోనే ఈ పథకంలో చేరొచ్చు. అందుకోసం మీ బ్యాంక్ అకౌంట్, పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మరీ ఆలస్యం చేయకుండా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు ఈ స్కీంలో చేరి ఉండకపోతే వెంటనే చేరండి.
Also Read: ఈ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన.. 259 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు..