AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తపై హెల్ప్‌లైన్‌ ద్వారా కోడలు ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్ పోలీసులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎవరైనా నేరం చేస్తే, లేదా అపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తారు. కానీ లక్నోకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అవాక్కయ్యారు.

అత్తపై హెల్ప్‌లైన్‌ ద్వారా కోడలు ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Up Woman Complaint Against Mother In Law
Balaraju Goud
|

Updated on: Mar 19, 2021 | 3:27 PM

Share

UP Woman Calls Police : ఉత్తరప్రదేశ్ పోలీసులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎవరైనా నేరం చేస్తే, లేదా అపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తారు. కానీ లక్నోకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అవాక్కయ్యారు. ఒక‌ప్పుడు కోడ‌ళ్లపై అత్తలు పెత్తనం చెలాయించేవారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. కోడ‌ళ్లే అత్తల‌పై జులుం చూపిస్తున్నారు. తాజాగా లక్నోకు చెందిన వివాహిత వేడి వేడి ఆహారం వ‌డ్డించ‌లేద‌ని అత్తపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ సంఘ‌ట‌న యూపీలోని గోర‌ఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

గ‌ఘ‌హా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మంజ్‌గ‌న్వాలో ఓ కుుటంబం నివాసముంటోంది. అత్త, కోడ‌ళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి భ‌ర్తలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రదేశాల్లో ఉంటున్నారు. అయితే, కోడ‌లు ఇంటి పనుల్లో ఏ మాత్రం అత్తకు స‌హాయం చేయ‌కుండా కాల‌క్షేపం చేస్తోంది. వంట ప‌నుల నుంచే మొద‌లుకుంటే అన్ని ప‌నులు అత్తే స్వయంగా చేసుకుంటోంది.

ఇదే క్రమంలో ఇటీవ‌లే అత్త స‌మ‌యానికి ఆహారం వ‌డ్డించ‌లేద‌ని, అదీ కూడా పాచిన ఆహారాన్ని వడ్డిస్తుందని.. కోడలు పోలీసు హెల్ప్‌లైన్ నంబ‌ర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే వారింటికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. త‌న అత్త టీవీ సీరియ‌ల్స్‌లో లీన‌మైపోతోంద‌ని, వేడి వేడి ఆహారం వ‌డ్డించ‌డం లేద‌ని కోడ‌లు పోలీసుల‌కు చెప్పింది. దీంతో రోజురోజుకు త‌న ఆరోగ్యం క్షీణిస్తోంద‌ని తెలిపింది. ఆమె మాట‌ల‌ు విన్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. అత్త కూడా కోడ‌లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వంటింటి ప‌నుల్లో కోడ‌లు స‌హాయం చేయ‌డం లేద‌ని అత్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరి వాద‌న‌లు విన్న పోలీసులు.. అత్తకోడళ్లను మంద‌లించారు. ఇలాంటి చిన్న విష‌యాల‌కు పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మ‌యం వృథా చేస్తే క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. అలాగే కుటుంబ సమస్యలను రచ్చకీడ్చొద్దని బుద్ధి చెప్పారు. కుటుంబసభ్యులు అందరూ కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించి వెళ్లిపోయారు.

Read Also… భద్రాచంలో విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి