మ్యాచింగ్ సెంటర్ ముసుగులో మాయ.. యువతులకు గాలం వేస్తూ రొంపిలోకి దింపుతున్న మహిళ.. గుట్టురట్టు చేసిన పోలీసులు

చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

మ్యాచింగ్ సెంటర్ ముసుగులో మాయ.. యువతులకు గాలం వేస్తూ రొంపిలోకి దింపుతున్న మహిళ.. గుట్టురట్టు చేసిన పోలీసులు
Police Arrested Woman Who Maintaining Brother House In Guntur
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 19, 2021 | 4:52 PM

Police raid a brothel house : చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు, ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్ట్‌ చేశారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో లైనులో నివాసం ఉండే షేక్‌ లాల్‌బీ అలియాస్‌ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్‌ సెంటర్‌ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది. పదేళ్ల కిందట ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో పనిచేసే శ్రీనివాసరావును వివాహం చేసుకుంది. అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాచలోనతో మ్యాచింగ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోంది.

ఇదే క్రమంలో షాపునకు వచ్చే వారిని బుట్టలో వేసుకుని మాయ మాటలతో వ్యభిచార రొంపిలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. చిన్న కుటుంబాలకు చెందిన మహిళలు, భర్తను కోల్పోయినవారు, కుటుంబ పరిస్థితులు సరిగా లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న యువతులను మభ్యపెట్టి వారిని చీకటి కూపంలోకి దింపి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారం అందుకున్న నగరంపాలెం పోలీసులు ఈ నెల 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంపై దాడి చేసి నిర్వాహకురాలు శ్రీలక్ష్మీతో పాటు మరో ముగ్గురు యువతులు, ముగ్గులు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ గుంటూరు కోర్టులో హాజరుపర్చినట్లు గుంటూరు వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కె.సుప్రజ తెలిపారు.

Read Also…  Lovers Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.