Lovers Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య..
Lovers Suicide in Prakasam Dist: రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం

Lovers Suicide in Prakasam Dist: రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని పెళ్లూరు వద్ద చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఒంగోలు రైల్వే సీఐ రామారావు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యువకుడు చీమకుర్తి మండలం గుడివాడ గ్రామానికి చెందిన వెంకటసాయి కృష్ణగా గుర్తించారు. యువతి స్వస్థలం చీమకుర్తిగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన యువతి, యువకుడు ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: