Bride Escape: శోభనం రాత్రి భర్తను చితక్కొట్టిన భార్య.. నగలు, డబ్బు తీసుకుని ఎస్కేప్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bride Escape: ఆ వరుడు ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టాడు. కానీ పాపం అనుకున్నది ఒక్కటి అయితే.. అక్కడ జరిగింది..

Bride Escape: శోభనం రాత్రి భర్తను చితక్కొట్టిన భార్య.. నగలు, డబ్బు తీసుకుని ఎస్కేప్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Bride Escape
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 19, 2021 | 3:47 PM

Bride Escape: ఆ వరుడు ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టాడు. కానీ పాపం అనుకున్నది ఒక్కటి అయితే.. అక్కడ జరిగింది మరొకటి. గదిలో వెళ్లగానే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఆ నవ వధువు. భర్త తలపై కొట్టి నగలు, డబ్బు తీసుకుని ఆమె బాయ్‌ ఫ్రెండ్‌తో ఉడాయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో వెలుగు చూసింది. అధికారిక సమాచారం ప్రకారం.. బిజ్నోర్ జిల్లాలోని కుండా ఖుర్ద్ గ్రామానికి చెందిన యువకుడికి, హరిద్వార్‌కు చెందిన ఓ యువతికి రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో వారి శోభనానికి పెద్దలు ఏర్పాటు చేశారు. వధువు, వరుడిని గదిలోకి పంపించి కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. ఇదే అదునుగా భావించిన ఆ నవ వధువు.. తన భర్తపై ఇనుప రాడ్డుతో కొట్టింది. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షల నగదు, సెల్ ఫోన్ తీసుకుని వధువు.. తన ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది.

కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చిన వరుడు.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాడు. కుటుంబ సభ్యులంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. వధువు తన భర్తను కొట్టి డబ్బులు, బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించినట్లు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని సమీక్షించారు. పారిపోయిన యువతి, ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, ఘటన ఎలా జరిగిందనే దానిపై బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. వధువు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. భర్తను కొట్టి పారిపోయిన యువతికి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదట. పెళ్లికి ముందే ఆమె ఓ వ్యక్తిని ప్రేమించిందని పోలీసులు గుర్తించారు. అతని కోసమే ఆమె ఇలా పారిపోయిందని తేల్చారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న వధువు, అతని ప్రియుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటన వరుడి గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ ఇద్దరు కలిసినా అదే అంశంపై చర్చించుకుంటున్నారు.

Also read:

YS Sharmila: ప్రజలు అన్ని రాజ్యాలు చూసిన తర్వాతే కేసీఆర్ వైపు మళ్లారు… తెలంగాణలో రాజన్న రాజ్యంపై మంత్రి అజయ్‌

నవీన్ పొలిశెట్టి హీలేరియస్ హిట్టుకు సీక్వెల్ రాబోతుందా ? ఇంతకీ దర్శకుడు ఏమన్నాడంటే..