AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుంది..? ఇలాంటి మిస్టెక్‌లు చేయొద్దు..

భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగొచ్చా? తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియపై ప్రభావం పడుతుందా? భోజనం మధ్యలో ఎక్కువ నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే గుక్కెడు నీరు తాగడం సాధారణంగా సమస్య కాదని సూచిస్తున్నారు. భోజనం సమయంలో, భోజనం తర్వాత నీరు తాగడంపై ఉన్న అపోహలు, వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి.

అన్నం తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుంది..? ఇలాంటి మిస్టెక్‌లు చేయొద్దు..
Drinking Water During Meals
Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2026 | 5:20 PM

Share

భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగొచ్చా..? తాగితే ఏమవుతుంది.. తరచూ ఇలాంటి సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతుంటాయి.. ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు, పండితులు పలు ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. పండితుల ప్రకారం.. మానవ జీవన విధానంలో ఆర్ష ధర్మాలు, సనాతన నియమాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి మన ధర్మశాస్త్రాలు విస్తృతంగా వివరించాయి. ఈ నియమాలు కేవలం సాంప్రదాయాలు కాదని, అవి శాస్త్రీయ దృక్పథంతో కూడుకున్నవని పలువురు పేర్కొంటున్నారు.

ఆధునిక విజ్ఞానానికి, సనాతన ధర్మ నియమాలకు మధ్య కొన్ని విషయాలలో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, అనేక అంశాలలో రెండూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి. ఉదాహరణకు, నెయ్యి గురించి ఆర్ష విజ్ఞానం, ఆధునిక సైన్స్ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అయితే, భోజన సమయంలో నీళ్ళు తాగడం అనే కీలకమైన అంశంపై రెండూ ఏకాభిప్రాయానికి వస్తాయి.

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగవచ్చా? ఎప్పుడు తాగాలి? అనే ప్రశ్నలు అనేకులలో తలెత్తుతాయి. ఈ విషయమై సైన్స్ పరంగా పరిశీలిస్తే, భోజనం చేసే మధ్యలో నీళ్లు తాగడం వల్ల శరీరంలోనికి గాలి ప్రవేశిస్తుంది. ఇది గ్యాస్ ట్రబుల్స్‌కు, గ్యాస్ట్రిక్ వ్యాధులకు దారి తీస్తుంది. ఆర్ష ధర్మం కూడా ఈ వాదనను సమర్ధిస్తుంది. భోజనం అయిన వెంటనే నీళ్లు తాగితే అది విషంతో సమానం అని ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా చెబుతుంది.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. భోజనం మధ్యలో గానీ, భోజనం అయిన వెంటనే గానీ నీరు తాగరాదు. భోజనం పూర్తయిన తర్వాత ఒక 15 నిమిషాల విరామం ఇచ్చి, ఒక గ్లాసు నీరు తాగాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా భోజనం సక్రమంగా జీర్ణమై, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆర్ష ధర్మం చెబుతుంది. ఆధునిక విజ్ఞానం కూడా ఇదే అభిప్రాయాన్ని నిర్ధారిస్తుంది.

భోజనం మధ్యలో గుక్కెడు నీళ్లు తాగడం వల్ల పెద్దగా నష్టం లేదు.. ఎక్కువ నీరు తాగొద్దని సూచిస్తున్నారు. ఒకేసారి కడుపు నిండా నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుందని.. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల