భద్రాచంలో విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Godavari River: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన

భద్రాచంలో విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Three Killed In Godavari River Drown
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 19, 2021 | 3:41 PM

Godavari River: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఏపీలోని తూర్పు గోదావరికి జిల్లాకు చెందిన ఓ కుటుంబం రెండు రోజుల క్రితం భద్రాచలం అయ్యప్ప కాలనీలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఐదుగురు స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఐదుగురు కూడా నీటిలో గల్లంతయ్యారు. నీటిలో వారు మునిగిపోతుండటాన్ని గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఇద్దరు మహిళలను రక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నీటిలో మునిగి మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మృతులు చరణ్‌, వరలక్ష్మి, సురేఖగా గుర్తించారు. భద్రాచలంలోని అయ్యప్ప కాలనీకి చెందిన కుటుంబం బతుకు తెరువు కోసం తూర్పుగోదావరి జిల్లా మండపేట వెళ్లిపోయారు. అయితే భద్రాచలం అయ్యప్ప కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు.
ఈ క్రమంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో అయ్యప్పకాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి..
Also Read:

‘పెద్దల మాట చద్దిమూట’ కవి ఆత్మహత్య.. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన మద్దా సత్యనారాయణ