Man Commits Suicide: ఆమె పోలీస్.. అతను వాలంటీర్.. వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే విషాదం..
Love Disputes: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. వివరాల్లోకెళితే.. ప్రకాశం..
Love Disputes: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నాగేంద్రబాబు అనే యువకుడు గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే సచివాలయంలో ఓ మహిళా పోలీసు విధులు నిర్వహిస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, వీరి ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు నాగేంద్ర బాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఈ క్రమంలో వివాదం కాస్తా ముదిరింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగేంద్ర బాబు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఫ్యాన్‌కు వేలాడుతున్న నాగేంద్ర బాబు మృతదేహాన్ని కిందకు దించారు. పోలీసులకు సమచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతకి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also read: