Corona Cases and Lockdown News LIVE: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు.. మూడు నెలల్లో అత్యధిక పాజిటివ్ కేసులు

| Edited By: Team Veegam

Updated on: Mar 19, 2021 | 6:20 PM

Corona Cases daily Updates: దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. వ్యాక్సిన్‌ వచ్చేసిందన్న ఆనందాన్ని కూడా ఆవిరి చేసేస్తోంది ఈ మహమ్మారి. 24 గంటల్లోనే 40 వేల కొత్త కేసులు బయటపడటం ఆందోళన కల్గిస్తోంది.

Corona Cases and Lockdown News LIVE: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు.. మూడు నెలల్లో అత్యధిక పాజిటివ్ కేసులు
Corona Virus

Corona Cases: కరోనా హడలెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు.. మరోసారి భయంకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా వెలువడ్డ తాజా బులిటెన్‌లో40 వేల కొత్త కేసులు బయటపడటం ఆందోళన కల్గిస్తోంది.

గడిచిన 24 గంటల్లో 10,57,383 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా..39,726 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోల్చితే 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ మహమ్మారి కారణంగా నిన్న 154 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం..

కరోనా..మూడు అక్షరాలు కాని..మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది..ఆ మూడు ఆక్షరాలకే దేశమే కాదు ఏకంగా ప్రపంచమే వణికిపోతోంది.. ఇప్పుడు అదే భయం కేంద్రానికి పట్టుకుంది..సెకండ్‌ వేవ్‌ విజృభిస్తోన్న సంకేతాలతో అప్రమతమైన కేంద్రం..రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Mar 2021 02:04 PM (IST)

    మహారాష్ట్రలో కోవిడ్ వైరస్ మరోమారు మహా రూపం

    మహారాష్ట్రలో కోవిడ్ వైరస్ మరోమారు తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో మహారాష్ట్ర అత్యధిక పాజిటివ్ కేసులతో అగ్ర స్థానంలో ఉండగా తాజాగా నమోదైన కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 25,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. 2021 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఒక్కరోజే ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

  • 19 Mar 2021 01:24 PM (IST)

    ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం..

    గురువారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,165 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 218 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు కూడా మరణించలేదని వైద్య శాఖ వెల్లడించింది. ఇక, ఇవాళ కొత్తగా 117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,92,740 కి చేరుకుంది. ఇక ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,759కి చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 7,186 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ.

    Ap Coronavirus Cases

    Ap Coronavirus Cases

    కాగా, కరోనా నిబంధనల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని తప్పక అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది.

  • 19 Mar 2021 01:23 PM (IST)

    మరోసారి కఠిన నిబంధనలు..

    భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది.

  • 19 Mar 2021 12:13 PM (IST)

    కోవిడ్ నేపథ్యంలో బీహార్ సర్కార్ కీలక నిర్ణయం

    కరోనాతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు విజృంభిస్తున్న సెలవుల్లో ఉన్నటువంటి వైద్యులు, హెల్త్ వర్కర్లు వెంటనే డ్యూటీలో చేరాలని ఆదేశించారు. గత 24 గంటల్లో కొత్తగా 107 కోవిడ్ -19 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • 19 Mar 2021 11:22 AM (IST)

    కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ..

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 313 కొత్త కరోనా కేసుల సంఖ్య నమోదు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,02,360కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దాంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,664కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,434 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 943 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి.

    Corona update in Telangana

    Corona update in Telangana

  • 19 Mar 2021 11:16 AM (IST)

    తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా​ కేసుల ఉద్ధృతి..

    తెలంగాణలో కరోనా​ కేసుల ఉద్ధృతి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 313 మంది వైరస్​ బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,02,360కు చేరింది. రాష్ట్రంలో గురువారం 62,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

  • 19 Mar 2021 11:05 AM (IST)

    తెలంగాణలో మళ్లీ క్రమంగా కేసులు పెరగడం..

    కాలం చేసిన గాయాన్ని మర్చిపోయి..అంతా సాధారణ పరిస్థితుల్లోకి వచ్చామో లేదో..మళ్లీ పంజా విసురుతోంది కరోనా వైరస్. మహమ్మారి దెబ్బకు విలవిల్లాడిపోయిన తెలంగాణలో మళ్లీ క్రమంగా కేసులు పెరగడం ఒకింత భయాందోళనలు కలిగిస్తోంది. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలోని మహాత్మజ్యోతిరావుపూలే బాయ్స్ గురుకుల పాఠశాలలో కేవలం రోజు వ్యవధిలో 34మంది మహమ్మారి బారినపడ్డారు.

    Covid 19 Test

    Covid 19 Test

Published On - Mar 19,2021 2:04 PM

Follow us
Latest Articles
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం