Telangana Corona Cases Update: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. పెరిగిన బాధితుల సంఖ్య.. ఇద్దరు మృతి..
Telangana Corona Cases Update: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య..
Telangana Corona Cases Update: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 313 కొత్త కరోనా కేసుల సంఖ్య నమోదు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,02,360కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దాంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,664కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,434 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 943 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి.
Also read:
ఇల్లు మారుతున్నారా ? అయితే మీ ఆధార్‌లోని ఇంటి చిరునామాను ఇలా క్షణాల్లో మార్చుకోండి..
నిన్నటి వరకు దినసరి కూలీలు.. నేడు కార్పొరేషన్లకు మేయర్లు.. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ప్రభంజనం