Stock Markets Today: ముంబై దలాల్ మార్కెట్లో కరోనా గుబులు.. భారీ నష్టాలతో మొదలైన వీకెండ్ మార్కెట్లు…

Stock Market: వీకెండ్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఐదు రోజుల నుంచి నష్టాల్లో పయనిస్తున్న సూచీలు నేడూ కూడా వరసలో కొనసాగిస్తున్నాయి.

Stock Markets Today: ముంబై దలాల్ మార్కెట్లో కరోనా గుబులు.. భారీ నష్టాలతో మొదలైన వీకెండ్ మార్కెట్లు...
Stock Markets
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 19, 2021 | 11:00 AM

వీకెండ్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఐదు రోజుల నుంచి నష్టాల్లో పయనిస్తున్న సూచీలు నేడూ కూడా వరసలో కొనసాగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసుల భయం మార్కెట్లకు పట్టుకున్నట్లే కనిపిస్తోంది.

సెన్సెక్స్‌ 48,881 , నిఫ్టీ 14,500 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. శుక్రవారం ఉదయం ప్రారంభంలో మార్కెట్లు కుప్పాలాయి. సెన్సెక్స్‌ 536 పాయింట్లు నష్టపోయి 48,667 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 182 పాయింట్లు దిగజారి 14,369 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.63 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాండ్ల ప్రతిఫలాలు పెరగడం, ఐరోపాలో మరోసారి కరోనా కేసులు పెరగడం అక్కడి సూచీలను దెబ్బతీస్తున్నాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోకి జారుకున్నాయి.

దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో కొటాక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు స్వల్ప లాభాల్లో రన్ అవుతన్నాయి. ఇక ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల బాటలోనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :  Corona Cases and Lockdown News LIVE: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు.. మూడు నెలల్లో అత్యధిక పాజిటివ్ కేసులు

ఇది కూడా ఔటేనా..! కాదే..! అంపైర్ నిర్ణయం సెటైర్లు..! కళ్లకు గంతలు కట్టుకున్నారా అంటూ సెహ్వాగ్ ట్వీట్..