PAN Aadhaar Link: మార్చి 31 వరకు ఈ పని చేశారా..? లేకపోతే రూ. 10 వేల జరిమానా చెల్లించాల్సిందే

PAN Aadhaar Link: మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు మార్చి 31వ తేదీ గడువు ముగియనుంది..

PAN Aadhaar Link: మార్చి 31 వరకు ఈ పని చేశారా..? లేకపోతే రూ. 10 వేల జరిమానా చెల్లించాల్సిందే
PAN Aadhaar Link
Follow us
Subhash Goud

|

Updated on: Mar 19, 2021 | 11:46 AM

PAN Aadhaar Link: మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు మార్చి 31వ తేదీ గడువు ముగియనుంది. ఇక తాజాగా పాన్‌ కార్డును మీ ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు చివరి తేదీ మార్చి 31. అయితే ఇప్పటికీ మారు అనుసంధానం చేయకపోతే ఈనెలాఖరులో గా చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. మీ బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తుతాయి. మార్చి 31లోగా ఈ పని చేయకపోతే రూ.10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానించుకోవాల్సిందిగా సూచిస్తూ సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గత ఏడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిని చివరి తేదీగా మార్చి 31, 2021 నిర్ణయించింది. ఈ లోపు ఈ రెండింటిని అనుసంధానించకపోయినట్లయితే ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఆ పాన్‌ కార్డు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి రూ. 10 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.

పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీల్లో కీలకం

పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకం. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్‌లలో ఇది ఎంతో ముఖ్యం. అయితే రూ. 50 వేలకు మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్‌ కార్డు తప్పనిసరి అవసరం. పాన్‌ చెట్లుబాటులో లేకపోతే ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. జరిమానా చెల్లించి పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నప్పుడే వీటిని అనుమతి ఇస్తారు. పాన్‌, ఆధార్‌లను లింక్‌ చేయడం సులభమే. ఇన్‌కంట్యాక్స్‌ ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటిపిని ఎంటర్‌ చేస్తే పూర్తయిపోతుంది.

లేదా..ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్‌ చేసి 12 అంకెల ఆధార్‌ నెంబరు, స్పేస్‌ ఇచ్చి, పాన్‌ నెంబరును.. 567678 లేదా 56161 అనే నెంబర్లకు సందేశం పంపించాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆధార్‌, పాన్‌ వివరాలన్నీ ఒకే విధంగా ఉండాలి. కాగా, ఇప్పటికే మీరు రెండింటిని జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లకి వెళ్లి చెక్‌ చేసుకోవడం మంచిది.

ఇవీ చదవండి:

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

Bank Locker Rules and Regulations: మీరు బ్యాంకులో లాకర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమ నిబంధనలు తెలుసుకోండి

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే