Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lowest Interest Rates: లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలిచ్చే 10 ప్రముఖ బ్యాంకులు ఇవే..

Lowest Interest Rates: ఆర్థిక స్వావలంబన సాధించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి బిజినెస్ లోన్స్ సరైన మార్గం. చాలా బ్యాంకులు..

Lowest Interest Rates: లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలిచ్చే 10 ప్రముఖ బ్యాంకులు ఇవే..
Lowest Interest Rates
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 19, 2021 | 9:58 AM

Lowest Interest Rates: ఆర్థిక స్వావలంబన సాధించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి బిజినెస్ లోన్స్ సరైన మార్గం. చాలా బ్యాంకులు ఎలాంటి షరతులు లేకుండానే చిన్న చిన్న ఒప్పందాలతో రుణాలను మంజూరు చేస్తాయి. కొత్త బ్యాంకులు ఆస్తులను తనఖా పెట్టుకుని రుణాలను ఇస్తాయి. క్రొత్త ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం చేయడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త పరికరాలు, కార్యాలయ స్థలం, ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి మీరు వ్యాపార రుణాన్ని ఉపయోగించవచ్చు.

ఇక వ్యాపార రుణాలు తీసుకోవాలనుకునే వారు.. వడ్డీ రేట్లు, రుణ పరిమితి, ప్రాసెసింగ్ ఫీజు, రుణాల్లో రకాలు, కనీస ఐటిఆర్ షరతులు, కంపెనీ టర్నోవర్, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం వంటి అంశాలను ప్రాథమికంగా పరిగణించవలసి ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ లోన్స్ తీసుకున్న వారి విధానాలను తెలుసుకోవడం ద్వారా.. బిజినెస్ లోన్ పొందడం మరింత సులువు అవుతుంది. ఇక వ్యాపారులు తమ క్రెడిట్ స్కోర్‌ను పెంచడానికి చిన్న మొత్తంలో రుణం తీసుకోవచ్చు. మీ కంపెనీ కొత్తది, ఎలాంటి నేపథ్యంలో లేనట్లయితే.. ముందుగా తక్కువ మొత్తంలో రుణం తీసుకుని సమయానికి తిరిగి చెల్లించడం ద్వారా మంచి క్రెడిట్ స్కోర్ పొందవచ్చు. అలా చేయడం ద్వారా.. ఎప్పుడైనా భారీ స్థాయిలో రుణం తీసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.

బిజినెస్‌ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలు.. క్రెడిట్ స్కోరు: భారతదేశంలో వ్యాపార రుణాలు పొందటానికి క్రెడిట్ స్కోర్‌ను ప్రామాణికంగా భావిస్తారు. బిజినెస్ మ్యాన్ క్రెడిట్ స్కోరు 700 పాయింట్ల కన్నా ఎక్కువగా ఉంటే, రుణ దరఖాస్తు త్వరగా అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే.. రుణం లభించే ఛాన్సెస్ తక్కువ అవడమే కాకుండా.. అధిక వడ్డీ రేట్లు చెల్లించే పరిస్థితి ఉండొచ్చు. వ్యాపార అనుభవం: వ్యాపారంలో రాణించాలంటే.. సంబంధిత వృత్తిలో కనీస అనుభవం చాలా ముఖ్యం. అనుభవం ఉన్నట్లయితే.. బిజినెస్ కెరీర్‌లో మరింత మెరుగ్గా రాణించచ్చు. అంతేకాదు.. ఒకవేల కొత్త కంపెనీని ప్రారంభించడానికి, లేదా ఉన్న దానిని విస్తరించాలన్నా వ్యాపార అనుభవం చాలా ముఖ్యం. దీనిని బేస్ చేసుకుని కూడా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. వార్షిక టర్నోవర్: బ్యాంకులు బిజినెస్ లోన్ ఇవ్వడానికి ముందు సదరు కంపెనీల వార్షిక టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. కంపెనీ టర్నోవర్ మంచిగా ఉంటే బ్యాంకులు వెంటనే లోన్ మంజూరు చేస్తాయి. ఇది కూడా వడ్డీ రేట్లు తగ్గడానికి ఉపకరిస్తుంది. రుణాల ఎంపిక: రుణ గ్రహిత బిజినెస్ లోన్ కోసం ఎలాంటి ఆప్షన్స్‌ను ఎంచుకుంటున్నారనేది కూడా వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. ఇదిలాఉంటే.. ఎన్‌బిఎఫ్‌సిలు, ఎన్‌బిఎఫ్‌సిల మాదిరిగానే వివిధ రకాల రుణ సంస్థలు వివిధ రకాల వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.

బిజినెస్ లోన్‌ కోసం ఏ ధృవపత్రాలు సమర్పించాలి: బిజినెస్ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 25 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వ్యాపార రుణం మంజూరు చేయడానికి అవసరమైన ప్రాథమిక పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే, ఈ ధృవపత్రాల జాబితా, తీసుకునే రుణం, బ్యాంకును బట్టి కూడా మారుతాయి. 1. సంవత్సర కాలానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ 2. మూడు సంవత్సరాల కాలానికి సంబంధించి ఆడిట్ ఫైల్స్. 3. ఆరు నెలల కాలానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్స్. 4. ప్రస్తుత సంవత్సరం కంపెనీ పనితీరు, టర్నోవర్ వివరాలు. 5. యాజమాన్య, భాగస్వామ్య ధృవీకరణ దస్తావేజులు అందించాల్సి ఉంటుంది. 6. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చే ధృవీకరించబడిన మెమోరాండం కాపీ. 7. కంపెనీ పాన్ కార్డ్, వ్యక్తిగత పాన్ కార్డ్ అవసరం. 8. ఐడీ ఫ్రూఫ్(ఓటర్, ఆధార్, లైసెన్స్) 9. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్(ఓటర్, ఆధార్, లైసెన్స్)

అత్యల్ప వడ్డీ రేట్లకే వ్యాపార రుణాలు అందించే పది బ్యాంకులు.. 1. ఎస్బిఐ 11.20% – 16.30 2. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 14.50% 3. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 15% – 21.35% 4. యాక్సిస్ బ్యాంక్ – 15.5% 5. ఐసిఐసిఐ బ్యాంక్ – 16% 6. కోటక్ బ్యాంక్ – 16.00% 7. కార్పొరేషన్ బ్యాంక్ – 13.55% 8. ధన్ లక్ష్మి బ్యాంక్ – 12.90% 9. ఆర్‌బిఎల్ బ్యాంక్ – 16.25% 10. ఇండస్ఇండ్ బ్యాంక్ – 14.00%

వ్యాపార రుణాల గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు.. స్థిర, చరాస్తులను తనఖా పెట్టడం ద్వారా తక్కువ వడ్డీ రేటుకే రుణం లభించే అవకాశం ఉంది. అసురక్షితమైన రుణాలు ఇచ్చే సంస్థలు ఎలాంటి తనఖా పెట్టుకోకుండానే లోన్‌ ఇస్తారు. దీని ద్వారా రిస్క్ ఎక్కువ, వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక బిజినెస్‌లోన్ లో ప్రాసెసింగ్ ఫీజు కింద మంజూరు చేసిన మొత్తంలో 2 శాతం నుంచి 6 శాతం వరకు తీసుకుంటారు. మరికొన్ని సంస్థలు సెట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అని వసూలు చేస్తారు. అలాగే.. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు రుసుము, వ్రాతపని ఖర్చులు, పార్ట్-చెల్లింపు రుసుము, డిఫాల్ట్ ఫీజు, ఇతర రుసుముల పేరుతో ఫీజును అన్ని వ్యాపార రుణాలపై విధిస్తారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. మీ వ్యాపార అవసరాలకు ఏ బ్యాంకు, ఏ సంస్థ కూడా వందశాతం రుణాలు మంజూరు చేయవు. అవసరమైన మొత్తంలో 10 నుంచి 30శాతం కోత విధిస్తారు.

Also read: Telangana MLC Election Results 2021 LIVE: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మూడో రోజు ఓట్ల లెక్కింపు

ఆరో రౌండులోనూ సురభి వాణిదేవి ఆధిక్యం.. కొనసాగుతోన్న కౌంటింగ్.. తుది ఫలితం తేలడానికి మరింత సమయం పట్టే అవకాశం