ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే ద్వారా ప్రయాణికులు మొదలు, గూడ్స్ వరకు ఎన్నో సేవలను ఇండియన్ రైల్వేస్ అందిస్తున్నాయి.
దూర ప్రయాణాలకు అనువైన ప్రయాణ సాధనం రైలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేవ్యవస్థ పనిచేస్తోంది. పాసింజర్ రైళ్ల నుంచి అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ వరకూ అనేక రకాల రైళ్లు మనకున్నాయి.
ప్రతీ రోజూ ఎన్నో లక్షల మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది ఈ రైల్వే వ్యవస్థ. నిమిషాలు, గంటలు, రోజులు.. ఇలా ప్రయాణీకుడు తమ గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. అందుకే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఇక దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారాణసి, బెంగళూరు, పట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
ఆయా రైల్వే స్టేషన్లలోకి ప్రయాణీకుడి దగ్గర కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి రానిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్లలో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక జన రద్దీ నియంత్రణ అవసరాలను బట్టి అదనపు స్టేషన్లను ఈ జాబితాలో చేర్చనున్నారు. అలాగే టికెట్ లేని, వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు వెయిటింగ్ ఏరియాలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అనధికార ఎంట్రీ పాయింట్లను క్లోజ్ చేస్తామన్నారు.
ప్రయాణికులు ముందస్తు బుకింగ్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని, వారు రైల్వే స్టేషన్‌కి వచ్చిన సమయంలో టికెట్ కన్ఫామ్ అయినట్లు నిర్ధారించుకోవాలి.
ఈ కొత్త విధానం ప్లాట్‌ఫామ్‌లపై రద్దీని తగ్గించాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసకున్నారు.