ఇక పుస్తకాల మోతకు గుడ్‌బై.. వీడియో
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గించేందుకు పాఠశాల స్థాయినుంచి సెమిస్టర్ విధానాన్ని తీసుకురానుంది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగత వరకు విద్యార్థులందరికీ సెమిస్టర్ల వారీగా పాఠ్యపుస్తకాలు అందించనుంది. మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను బడులు తెరిచిన తర్వాత జూన్‌లో ఇస్తారు. మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక రెండో సెమిస్టర్ పుస్తకాలు కూడా అందజేస్తారు.
సెమిస్టర్ విధానం వల్ల ఒకటి, రెండు తరగతుల విద్యార్ధులకు కేవలం రెండు పుస్తకాలే ఉంటాయి. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లతో కలిపి మొత్తం ఆరు పుస్తకాలు ఇచ్చేవారు. విద్యాశాఖ తాజా నిర్ణయంతో తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్య పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా, వీటికి సంబంధించిన వర్క్‌బుక్‌లను మరొక పుస్తకంగా ఇస్తారు. ఈ రెండు పుస్తకాలు రెండు సెమిస్టర్లుగా విద్యార్థులకు అందిస్తారు. మూడు, నాలుగు, ఐదు తరగతులకు నాలుగు పాఠ్యపుస్తకాల చొప్పున అందిస్తారు. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు కలిపి ఒకటి, గణితం, ఈవీఎస్ కలిపి మరొకటి ఉంటుంది. వీటికి వర్క్‌బుక్‌లను మరో రెండు ఇస్తారు. ఇలా చేయడం ద్వారా విద్యార్ధులకు పుస్తకాల మోత భారీగా తగ్గుతుంది. అటు ఆరు నుంచి 9వ తరగతి వరకు కూడా విద్యార్ధుల పాఠ్యపుస్తకాలను భారీగా తగ్గించారు. తెలుగు, ఆంగ్లం, హిందీలకు కలిపి ఒకే పుస్తకంగా రానుంది. మిగతావి మాత్రం సబ్జెక్టు వారీగా విడివిడిగా అందిస్తారు. అంతేకాకుండా అన్ని తరగతుల పుస్తకాల సైజు కూడా బాగా తగ్గనుంది. ముఖ్యంగా లాంగ్వేజ్ పుస్తకాలన్నీ ఒకే పుస్తకంగా రావడంతో బరువు చాలా వరకు తగ్గనుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాల ప్రకారం సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో
రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో
సెల్‌ఫోన్ ఎఫెక్ట్.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో
చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?