Telangana Assembly: వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం..
ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతోపాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు.. ఈ బిల్లులపై సోమవారం అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఇవాళ సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు రానున్నాయి. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. వీటికి ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకోనుంది ప్రభుత్వం.. ప్రధానంగా బీసీల రిజర్వేషన్లపై 2, ఎస్సీ వర్గీకరణపై ఒక బిల్లును సభలో ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం..
ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతోపాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు.. ఈ బిల్లులపై సోమవారం అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరగనుంది.
కాగా.. సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. పొన్నం ఛాంబర్‌లో బ్రేక్‌ఫాస్ట్ మీట్ జరిగింది.. ఇవాళ ప్రవేశపెడుతున్న బిల్లుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ముందుకు 5 బిల్లులు రాబోతున్నాయ్.. అవేంటో చూడండి..
బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదటి బిల్లు..
స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు..
ఎస్సీ వర్గీకరణ బిల్లు
తెలుగు వర్సిటీ పేరుమార్పుపై బిల్లు..
తెలంగాణ చారిటబుల్-హిందూ సంస్థల చట్టసవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో