AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరో రౌండులోనూ సురభి వాణిదేవి ఆధిక్యం.. కొనసాగుతోన్న కౌంటింగ్.. తుది ఫలితం తేలడానికి మరింత సమయం పట్టే అవకాశం

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో పూర్తయిన ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉత్కంఠగా సాగుతోంది. ఆరో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి..

ఆరో రౌండులోనూ సురభి వాణిదేవి ఆధిక్యం.. కొనసాగుతోన్న కౌంటింగ్.. తుది ఫలితం తేలడానికి మరింత సమయం పట్టే అవకాశం
K Sammaiah
|

Updated on: Mar 19, 2021 | 9:55 AM

Share

తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుండగా.. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో పూర్తయిన ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉత్కంఠగా సాగుతోంది. ఆరో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై 7,626 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

మొత్తం ఆరు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,05,710 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 50,450, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు.

అయితే మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలనందున రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అయింది. ఆ రౌండులోనూ ఫలితం తేలకుంటే మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో తుది ఫలితం తేలే వరకు మరింత ఆలస్యం కానుందని అధికారులంటున్నారు.

అయితే పోటాపోటీగా సాగిన హైదరాబాద్‌ స్థానంలో వాణిదేవి గట్టి పోటినివ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును ఎలాగైనా ఓడించి, బీజేపీకి గట్టి సమాధానం ఇవ్వాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంది. అందుకోసం పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. పార్టీ కీలక నేతలు, మంత్రులను రంగంలోకి దిగి ప్రచారం చేశారు. పీవీ కుమార్తె అనే టైటిల్‌ను ఉపయోగించి ఓట్లను అభ్యర్థించారు. ఇక సీఎం వ్యూహం ఫలించే దిశగా ఫలితాలు వెలువడుతుండటంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read More:

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు.. నూతన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ

MLC Elections: నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. జోరులో టీఆర్ఎస్..

‘పెద్దల మాట చద్దిమూట’ కవి ఆత్మహత్య.. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన మద్దా సత్యనారాయణ