MLC Elections: నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. జోరులో టీఆర్ఎస్..
Telangana Graduate MLC Elections: నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు..
Telangana Graduate MLC Elections: నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 1,10,840 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తరువాత రెండో స్థానంలో 83,290 ఓట్లతో తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో నిలిచారు. కోదండరాంకు ఇప్పటి వరకు 70,072 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నపై పల్లా రాజేశ్వర్ రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో గెలుపొందాలంటే 1,83,168 ఓట్లు పోలవ్వాల్సి ఉంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అంతమేర ఓట్లు ఎవరికీ పోలవకపోవడంతో.. అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. తుది ఫలితం తేలేందుకు మరో 36 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవీ ముందంజలో ఉన్నారు. ఐదో రౌండ్లలో వాణీ దేవికి 88,304 ఓట్లు పోలవగా.. 6,555 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 81,749 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్ రావు రెండో స్థానంలో ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు రూ. 42,604 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు నమోదు అయ్యాయి. టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 4,656 ఓట్లు పోలయ్యాయి. ఇక ఐదు రౌండ్లలో 16,712 ఓట్లు నోటాకు పోలవడం విశేషం.
Also read: