AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!

మనం ఒక అందమైన భవనాన్ని చూసినప్పుడు దాని రంగులు, కిటికీలు, అలంకరణలు మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ, ఆ భవనం దశాబ్దాల పాటు గంభీరంగా నిలబడటానికి కారణం భూమి లోపల ఎవరికీ కనిపించని 'పునాది'. మనిషి వ్యక్తిత్వం కూడా సరిగ్గా ఇలాంటిదే.

ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!
Childhood Psychology.jpg
Nikhil
|

Updated on: Feb 20, 2026 | 10:48 PM

Share

ఈరోజు మీరు ఎంత ధైర్యంగా ఉన్నా లేదా ఎంత అభద్రతా భావంతో ఉన్నా.. దాని వేళ్లు మీ జీవితంలోని మొదటి 2,000 రోజుల్లో (మొదటి ఐదేళ్లు) పాతుకుపోయి ఉన్నాయి. సైకాలజీ భాషలో దీనిని ‘ఫౌండేషనల్ స్టేజ్’ అంటారు. సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది. “ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను”. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ప్రముఖ సైకాలజిస్ట్ ఎలిజబెత్ హర్లాక్ ఈ కాలాన్ని ‘పునాది దశ’ అని పిలిచారు. మీరు 30 ఏళ్ల వయస్సులో స్టేజ్ మీద మాట్లాడటానికి భయపడుతున్నారంటే, దానికి కారణం ప్రస్తుతం మీలో ఉన్న లోపం కాదు.. 3 ఏళ్ల వయస్సులో మీ సబ్-కాన్షియస్ మైండ్‌లో పడ్డ ఒక చిన్న ప్రతికూల ముద్ర. ఆ పునాది గోడలు ఎలా నిర్మితమవుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నమ్మకం vs అపనమ్మకం (మొదటి ఏడాది)..

బిడ్డ పుట్టిన మొదటి ఏడాదిలో నేర్చుకునే అత్యంత ముఖ్యమైన విషయం “ఈ ప్రపంచం సురక్షితమైనదా? కాదా?”. బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి వెంటనే దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా నిమరడం చేస్తే.. “ప్రపంచం నమ్మదగినది” అనే భావం ఏర్పడుతుంది. అదే నిర్లక్ష్యం చేస్తే, పెద్దయ్యాక వారు ఎవరినీ త్వరగా నమ్మలేరు.

ఆత్మవిశ్వాసం vs సందేహం (2 నుండి 3 ఏళ్లు)

ఈ దశలో బిడ్డ తనంతట తాను నడవడం, తినడం నేర్చుకుంటాడు. “వద్దు.. నీకు రాదు, వొంపేస్తావు” అని ప్రతిదానికీ అరిస్తే.. వారిలో ‘నేను ఏదీ సరిగ్గా చేయలేను’ అనే సందేహం, సిగ్గు మొదలవుతాయి. ఇది భవిష్యత్తులో వారి సెల్ఫ్-కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుంది.

చొరవ vs అపరాధభావం (4 నుండి 5 ఏళ్లు)

ఈ వయస్సులో పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తే వారిలో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత పెరుగుతాయి. అలా కాకుండా విసుక్కుంటే, వారిలో ‘అపరాధభావం’ నాటుకుపోతుంది. పెద్దయ్యాక వీరు కొత్త పనులు మొదలుపెట్టాలన్నా భయపడతారు.

నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి?

చాలామంది మోటివేషనల్ స్పీకర్లు అద్దం ముందు నిలబడి గట్టిగా అరవమనో, బాడీ లాంగ్వేజ్ మార్చమనో చెబుతుంటారు. కానీ లోపల ఉన్న ఐదేళ్ల పిల్లాడు భయపడుతున్నంత కాలం ఈ పైపై పూతలు పనిచేయవు. అసలైన మార్పు రావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ పద్ధతిని అనుసరించాలి.

  • విశ్లేషించడం : మీ ప్రస్తుత సమస్యల మూలాలు చిన్నతనంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. “నన్ను చిన్నప్పుడు అతిగా కంట్రోల్ చేశారా?” అని విశ్లేషించుకోవాలి.
  • తిరిగి నిర్మించడం : దీనినే ‘రీ-పేరెంటింగ్’ అంటారు. చిన్నప్పుడు మీకు దక్కని ప్రోత్సాహాన్ని ఇప్పుడు మీరు మీకు ఇచ్చుకోవాలి. మీ అంతరాత్మతో మీరు మాట్లాడే తీరును మార్చుకోవాలి.
  • పరిమితులకు ఆవల :పాత గాయాలను గుర్తించి వాటిని పూడ్చినప్పుడు, మీరు ఒక స్వేచ్ఛా జీవిగా మారుతారు. ఎదుటివారి సర్టిఫికేట్లతో సంబంధం లేకుండా మీ లెగసీని మీరు నిర్మించుకుంటారు.

మొదటి ఐదేళ్లు మీ వ్యక్తిత్వానికి పునాది వేశాయి, అది మీ తప్పు కాదు. కానీ 30 ఏళ్ల వయస్సులో కూడా అదే పాత భయాలతో బ్రతకడం మీ బాధ్యతారాహిత్యం అవుతుంది. మీ పునాది గోడల్లో పగుళ్లు ఉన్నాయని తెలిస్తే, వాటిని స్పృహతో పూడ్చుకోవచ్చు.

Follow Us