AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలీడే అని రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేసి చూడగా..

ఒక్కసారి ఊహించుకోండి.. మీరు ఎంతో ఉత్సాహంగా విహారయాత్ర కోసం ఒక విలాసవంతమైన రిసార్ట్‌కు వెళ్లారు. మీరు అక్కడి వాష్‌రూమ్ యూజ్‌ చేయాలని, టాయిలెట్ సీటును పైకి లేపగానే అందులోంచి బుసలు కొడుతూ నాగుపాము బయటకు వస్తే ఎలా ఉంటుంది..పై ప్రాణాలు పైకే పోతాయి కదా..? ఒళ్లు గగుర్పాటుకు గురికావటం ఖాయం. సరిగ్గా ఇదే సంఘటన ఒక స్నేహితుల బృందానికి ఎదురైంది. ఈ భయంకరమైన షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

హాలీడే అని రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేసి చూడగా..
King Cobra In Toilet
Jyothi Gadda
|

Updated on: May 18, 2026 | 3:38 PM

Share

మనం ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లినప్పుడు రిసార్ట్‌లలో ఎంతో ప్రశాంతంగా గడపాలని అనుకుంటాం. కానీ, ఫిలిప్పీన్స్ లోని సాల్వడార్ బెనెడిక్టో ప్రాంతంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల బృందానికి మాత్రం జీవితంలో మర్చిపోలేని ఒక భయానక అనుభవం ఎదురైంది. వారు బస చేసిన ఒక ప్రముఖ రిసార్ట్‌ బాత్‌రూమ్‌లోని టాయిలెట్ కమోడ్‌లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. అసలేం జరిగిందంటే?

నార్తర్న్ నెగ్రోస్ నేచురల్ పార్క్ సమీపంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన ఈ స్నేహితుల్లో ఒకరు ఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్‌కు వెళ్లారు. అక్కడ కమోడ్ సరిగ్గా ఫ్లష్ కాలేదని గమనించి, మళ్లీ ఫ్లష్ బటన్ నొక్కాడు. అంతే.. ఆ ఫ్లష్ నీటి వేగానికి లోపల దాక్కున్న ఒక భారీ పాము పడగెత్తి పైకి లేచింది. మొదట దాన్ని సాధారణ నీటి పాముగా భావించిన ఆ స్నేహితులు, ఒక పొడవాటి కర్రతో దాన్ని కదిలించి చూశారు. అది ఒక్కసారిగా బయటకు వచ్చి కెమెరా వైపు నాలుక చాస్తూ బుసలు కొట్టడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ఈ భయంకరమైన దృశ్యాన్ని వారు తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియోను స్నేహితుల బృందంలోని ఒక సభ్యుడు రెప్టైల్ (సరీసృపాల) నిపుణులకు చూపించగా, అది సాధారణ పాము కాదని, అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా అని వారు నిర్ధారించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండటంతో, చల్లదనం కోసం ఆ పాము పైపు లైన్ల ద్వారా కమోడ్‌లోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. రిసార్ట్ సిబ్బంది సహాయంతో ఆ పామును సురక్షితంగా పట్టుకున్నారు. అయినప్పటికీ, ఆ భయం నుండి తేరుకోలేకపోయిన పర్యాటకులు వెంటనే తమ లగేజ్ సర్దుకుని ఆ రిసార్ట్‌ను ఖాళీ చేసి, వేరే హోటల్‌కు మారిపోయారు. ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో పర్యాటకులను హెచ్చరిస్తోంది. ముఖ్యంగా అడవులు, కొండల ప్రాంతాలకు సమీపంలో ఉండే హోటల్స్ లేదా రిసార్ట్‌లకు వెళ్లినప్పుడు బాత్‌రూమ్‌లను ఉపయోగించే ముందు ఒక్కసారి సరిచూసుకోవడం ఎంతో అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us