AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీరియడ్ లీవ్ అడిగిన ఉద్యోగినికి షాక్ ఇచ్చిన సాఫ్ట్ బాస్.. రిప్లై చూస్తే ఫిదా!

చాలా మంది ఉద్యోగులకు పని నుండి సెలవు అడగడం సులభం కాదు. కార్పొరేట్ ప్రపంచంలో లీవ్ (సెలవు) అడగడం అనేది ఉద్యోగులకు ఒక పెద్ద టాస్క్. అయితే, పీరియడ్స్ నొప్పుల కారణంగా సెలవు కావాలని అడిగిన ఒక మహిళా ఉద్యోగినికి ఆమె మేనేజర్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట ఒక కొత్త చర్చకు దారితీస్తోంది.

పీరియడ్ లీవ్ అడిగిన ఉద్యోగినికి షాక్ ఇచ్చిన సాఫ్ట్ బాస్.. రిప్లై చూస్తే ఫిదా!
Boss Response To Menstrual LeaveImage Credit source: News 9
Jyothi Gadda
|

Updated on: May 17, 2026 | 7:45 PM

Share

సాధారణంగా ఆఫీసుల్లో సెలవు పెట్టాలంటే ఉద్యోగులు ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు పీరియడ్స్ (నెలసరి) సమయంలో తీవ్రమైన నొప్పులు భరిస్తూ కూడా లీవ్ అడగడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఒక మహిళా ఉద్యోగిని ఏమాత్రం దాచకుండా నిజం చెప్పి సెలవు అడగ్గా, ఆమె మేనేజర్ స్పందించిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సదరు మహిళా ఉద్యోగిని తన మేనేజర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తూ.. సార్, ఈరోజు నాకు పీరియడ్స్ మొదటి రోజు కావడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, నీరసంగా ఉంది. అందుకే ఈరోజు ఆఫీస్‌కు రాలేను. ఒకవేళ వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేస్తాను లేదా లీవ్ ఇవ్వండి అని కోరింది.

దీనికి ఆ మేనేజర్ ఎంతో సానుకూలంగా స్పందిస్తూ.. అస్సలు వర్క్ చేయొద్దు. బిందాస్‌గా విశ్రాంతి తీసుకోండి (Bindaas Aaram Karo). దీనికోసం మీ జీతంలో ఎలాంటి కోత (Salary Cut) ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త అని రిప్లై ఇచ్చాడు. ఈ చాట్ స్క్రీన్ షాట్‌ను సదరు ఉద్యోగిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (ట్విట్టర్) లో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మెజారిటీ ప్రజలు సదరు మేనేజర్‌ను అభినందిస్తున్నారు. ప్రతి ఆఫీసులోనూ ఇలాంటి అర్థం చేసుకునే బాస్ ఉంటే ఉద్యోగుల ఉత్పాదకత (Productivity) మరింత పెరుగుతుంది అని కొనియాడుతున్నారు.

అయితే, ఇదే సమయంలో కార్పొరేట్ రంగంలో పీరియడ్స్ లీవ్ విధానంపై పెద్ద చర్చ మొదలైంది. మహిళల శారీరక ఇబ్బందులను గుర్తించి అన్ని కంపెనీలు నెలకు 1 లేదా 2 రోజులు పెయిడ్ పీరియడ్ లీవ్స్ ఇవ్వాలని కొందరు వాదిస్తుండగా.. దీనివల్ల కంపెనీలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి వెనుకాడుతాయని, ఇది పరోక్షంగా లింగ వివక్షకు దారితీస్తుందని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ వైరల్ చాట్ మాత్రం కార్పొరేట్ సంస్కృతిలో మానవత్వానికి ఉన్న ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us