AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురుగుల్లా కనిపించే ఈ కూరగాయ రుచి మహాద్భుతం..! మధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులకు పరమౌషధం!

ప్రకృతి ఒడిలో పెరిగే అనేక రకాల మొక్కలు మనకు తెలియకుండానే ఎన్నో ఆరోగ్య రహస్యాలను దాచుకుంటాయి. అలాంటి వాటిలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాలలోని నీటి బుగ్గలు, వాగుల వెంబడి సహజంగా పెరిగే లింగుడా (Linguda) ఒకటి. దీనిని ఇంగ్లీషులో ఫిడిల్‌హెడ్ ఫెర్న్ (Fiddlehead Fern) అని పిలుస్తారు. ఈ అడవి కూరగాయ రుచిలోనే కాదు, ఔషధ గుణాల్లోనూ ఎంతో విశిష్టమైనదని డెహ్రాడూన్‌కు చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సిరాజ్ సిద్ధిఖీ పేర్కొన్నారు. పురుగుల కనిపించే ఈ కూరగాయ రుచి మహాద్భుతంగా ఉంటుందని చెప్పారు. మధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులతో పాటు ఎన్నో వ్యాధులకు పరమౌషధం అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: May 17, 2026 | 4:38 PM

Share
ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరిగే లింగుడా (Linguda) అనే అడవి కూరగాయ (Fiddlehead Fern) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డెహ్రాడూన్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ సిరాజ్ సిద్ధిఖీ అభిప్రాయం ప్రకారం.. విటమిన్ ఎ, బి-కాంప్లెక్స్, సి, పొటాషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ మొక్క ఒక ఔషధ గని. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

1 / 6
పోషకాల భాండాగారం: లింగుడాలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. సాధారణ కూరగాయలతో పోలిస్తే ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువ. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి.

2 / 6
మధుమేహం నియంత్రణ: లింగుడాలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఆహారం.

3 / 6
గుండె ఆరోగ్యం, రక్తపోటు: ఇందులో కొలెస్ట్రాల్, సోడియం శాతాలు దాదాపు శూన్యం. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు (Blood Pressure) నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

4 / 6
కీళ్ల నొప్పుల నివారణ: ఆయుర్వేదం ప్రకారం, లింగుడాలో శోథ నిరోధక (Anti-inflammatory) గుణాలు ఉన్నాయి. వర్షాకాలం, చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపుల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

5 / 6
బరువు తగ్గడం, జీర్ణక్రియ: క్యాలరీలు చాలా తక్కువగా ఉండి, ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. లింగుడాను ఎప్పుడూ పచ్చిగా తినకూడదని డాక్టర్ సిద్ధిఖీ హెచ్చరించారు. అడవుల్లో పెరిగే ఈ మొక్కపై రకరకాల బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనిని వండే ముందు వేడి నీటిలో బాగా కడిగి, ఆపై చక్కగా ఉడికించి మాత్రమే కూరగా లేదా పచ్చడిగా తీసుకోవాలి. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ సూపర్‌ఫుడ్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

6 / 6
Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..

  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?