AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు

భార్యతో గొడవ వద్దని ప్రశ్నించిన అత్త కుటుంబంపై అల్లుడు దారుణంగా దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. కర్రలు, రాడ్లతో జరిగిన దాడిలో వృద్ధురాలు ఫాతిమా మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు
Guntur Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: May 18, 2026 | 3:46 PM

Share

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరానికి చెందిన మస్తాన్ వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఆరు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. మరోసారి గర్భవతి అయిన కరిష్మాకు స్కానింగ్ మరోసారి ఆడపిల్లే అని తేలింది. దీంతో మస్తాన్ వలి భార్య కరిష్మాకు ఆబార్షన్ చేయించాడు. అప్పటి నుండి భార్య భర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. నీకు ఆడపిల్లలే పుడుతున్నారంటూ ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలోనే మొదటి ఆడపిల్ల ఉందని ఆమెకు కరిష్మా పుట్టింటి వాళ్ల పేరు మీద ఉన్న ఇంటిని రాయించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజుల క్రితం భార్య భర్తల మధ్య ఆ ఇంటి విషయమై మరోసారి ఇద్దరి గొడవ జరిగింది. దీంతో కరిష్మాను ఆమె కూతురు నేహా అంజుమ్ ను… మస్తాన్ వలి పుట్టింటికి పంపించేశాడు.

వారం రోజుల పాటు సత్తెనపల్లిలోని పుట్టింట్లోనే ఉన్న కరిష్మా, ఆమె కుమార్తె ను తీసుకొని కరిష్మా తల్లి అల్లాబీ.. కరిష్మా అమ్మమ్మ ఫాతిమా ఆటోలో నాగవరం వచ్చారు. అక్కడ మస్తాన్ వలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరిష్మావాళ్లకు గొడవ జరిగింది. ఆడిపిల్లలు పుడుతున్నారని పుట్టింటికి పంపించడంపై కరిష్మా తల్లి మస్తాన్ వలిని అదే విధంగా వారి బంధువులను నిలదీసింది. ఈ వివాదం జరుగుతుండగానే మస్తాన్ వలి కర్రలు, రాడ్లతో కరిష్మా వాళ్లపై దాడి చేశారు.

ఈ దాడిలో అల్లాబి, ఫాతిమాకు తీవ్ర గాయాలయ్యాయి. వయస్సు పెద్దది కావడంతో గాయాలకు తాళలేక ఫాతిమా అక్కడికక్కడే చనిపోయింది. అమ్మమ్మ చనిపోవడం, తల్లికి తీవ్ర గాయాలు కావడంతో బెదిరిపోయిన కరిష్మా తన కుమార్తె నేహా అంజుమ్ ను తీసుకొని వచ్చిన ఆటోలోనే సత్తెనపల్లి వచ్చేసింది. అక్కడ నాగవరంలో జరిగిన విషయాన్ని బంధవులకు చెప్పి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఫాతిమా అప్పటికే మృతి చెందగా అల్లాబికి తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది.

తన అమ్మమ్మను చంపి, తల్లిని గాయపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరిష్మా డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us