Bigg Boss 10 Season: ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది.. హోస్ట్ ఎవరంటే..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటివరకు మొత్తం 9 సీజన్స్ కంప్లీ్ట్ అయ్యాయి. ఇటీవల ముగిసిన సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల నిలిచారు ఇక ఇప్పుడు పదవ సీజన్ రాబోతుంది. తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం విడుదలైన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇంతకీ హోస్ట్ ఎవరో తెలుసా..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu). ఇప్పటివరకు తెలుగులో మొత్తం 9 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇటీవల ముగిసిన 9వ సీజన్ విజేతగా కామన్ మెన్ కళ్యాణ్ పడాల నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ షో సరికొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. సంచలన విజయాలతో దూసుకుపోతున్న ఈ షో, ఇప్పుడు పదో సీజన్‌లోకి (Season 10) అడుగుపెడుతోంది. తాజాగా స్టార్ మా విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున (Nagarjuna) తనదైన స్టైలిష్ లుక్, హోస్టింగ్‌తో ఈ ప్రోమోలో అదరగొట్టారు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..
ఈ సరికొత్త ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ ఘనతను వివరిస్తూ మాట్లాడారు. “బిగ్ బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం” అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపాయి. ఈ మహా సామ్రాజ్యాన్ని రూల్ చేసేది తాను కాదని, బిగ్ బాస్‌ను అమితంగా ప్రేమించే అభిమానులేనని నాగ్ స్పష్టం చేశారు. ‘నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్’ అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఈ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సారి ప్రోమోను కాస్త విభిన్నంగా డిజైన్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, సెలూన్ షాపుల నుంచి ఐటీ ఆఫీసుల వరకు, ఇళ్లలో కుటుంబ సభ్యులంతా బిగ్ బాస్ కోసం ఎంతగా ఎదురుచూస్తారో ఇందులో చూపించారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇదొక డైలీ డోస్ ఎంటర్టైన్‌మెంట్‌గా మారిందని, ఎమోషన్స్, గొడవలు, నవ్వులతో సాగే ఈ షో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందని ప్రోమో ద్వారా హింట్ ఇచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..
ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ :
చివర్లో నాగార్జున “ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతోంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్ బాస్ ‘దశావతారం’ (పదో సీజన్). ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!” అంటూ షోపై అంచనాలను భారీగా పెంచేశారు. కింగ్ నాగ్ మార్క్ ఎనర్జీతో ఉన్న ఈ ‘కమింగ్ సూన్’ ప్రోమో చూస్తుంటే, ఈ సారి కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..
బిగ్ బాస్ 10 సీజన్ ప్రోమో..
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
