AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పొలంలో నాగలితో దున్నుతుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..

గుంటూరు–మంగళగిరి మార్గంలోని కాజ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా రెండు ప్రాచీన గణపతి విగ్రహాలు, పురాతన మట్టి పాత్రల పెంకులు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి పరిశీలనలో ఇవి శాతవాహనులు–ఆనందగోత్రినుల కాలానికి చెందినవిగా, సుమారు క్రీ.శ. నాలుగో శతాబ్దం నాటి అరుదైన శిల్పాలుగా గుర్తించారు.

Andhra: పొలంలో నాగలితో దున్నుతుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
Tillage (Representative image )
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 26, 2026 | 11:38 AM

Share

గుంటూరు–మంగళగిరి ప్రధాన రహదారిపై ఉన్న కాజ గ్రామంలో ప్రాచీన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన వెంకటరామారెడ్డి తన పొలంలోని పాటి దిబ్బను నాగలితో తవ్వుతుండగా రెండు అరుదైన గణపతి విగ్రహాలు, పురాతన మట్టి పాత్రల పెంకులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచిన ఆయన.. ప్లీచ్ ఇండియా అధ్యక్షుడు, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డికి చూపించారు. పరిశీలించిన నాగిరెడ్డి వాటి కాలాన్ని, చారిత్రక విశిష్టతను వివరించారు.

తవ్వకాలలో లభించిన విగ్రహాల్లో ఒకటి సుమారు 3 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉండగా, మరొకటి 2 సెంటీమీటర్ల ఎత్తు, 4 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. ఈ విగ్రహాలను ఎర్ర ఇసుకరాతితో చెక్కినట్లు గుర్తించారు. వీటితో పాటు ఎరుపు, నలుపు, గచ్చకాయ, గోధుమ రంగుల మట్టి పాత్రల పెంకులు కూడా లభించాయి. ఇవన్నీ శాతవాహనులు, ఆనందగోత్రినుల కాలానికి చెందినవిగా ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

Archaeology

లభించిన గణపతి విగ్రహాల్లో గణేశుడు రెండు చేతులతో, ఒక చేతిలో దంతం, మరో చేతిలో మోదకం ధరించి, తలపై కిరీటం లేకుండా సహజసిద్ధమైన ఏనుగు తల, పొడవాటి తొండ, పెద్ద బొజ్జతో లలితాసనంలో ఆసీనుడిగా కనిపిస్తున్నట్లు నాగిరెడ్డి వివరించారు. ఈ ప్రతిమలు పల్నాడు జిల్లా చేజర్లలోని కపోతేశ్వరాలయంలో ఉన్న పాలరాతి గణేశ విగ్రహాన్ని పోలి ఉన్నాయని, అందువల్ల ఇవి క్రీ.శ. నాలుగో శతాబ్దానికి చెందిన ఆనందగోత్రినుల కాలం నాటివిగా భావిస్తున్నట్లు చెప్పారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ విగ్రహాలు, పురావస్తువులను అత్యంత జాగ్రత్తగా సంరక్షించాలని వెంకటరామారెడ్డికి ఈమని శివనాగిరెడ్డి సూచించారు.

Ancient Ganesha Idols

Ancient Ganesha Idols

 కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ 

Follow Us
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..
ఆమె 90's కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..
ఆమె 90's కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
ఈ పుష్పం ఉంటే అదృష్టమే..! తొలి ఏకాదశి రోజు వికసించిన బ్రహ్మ కమలం
ఈ పుష్పం ఉంటే అదృష్టమే..! తొలి ఏకాదశి రోజు వికసించిన బ్రహ్మ కమలం
48 ఏళ్ల టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
48 ఏళ్ల టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?