AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం వెళ్లేవారికి గుడ్ న్యూస్.. నల్లమల మీదుగా కొత్త ఎలివేటెడ్ కారిడార్.. అక్కడ ఐకానిక్ బ్రిడ్జి..

ఇకపై రాత్రి సమయాల్లో కూాడా నల్లమల అడవి మీదుగా శ్రీశైలంకు చేరుకోవచ్చు. ఈ మేరకు కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా పనులపై కూడా ముందడుగు పడింది. ప్రస్తుతం సర్వే పనులు మొదలయ్యాయి. దోర్నాలలో సర్వే పనులు జరుగుతున్నాయి.

శ్రీశైలం వెళ్లేవారికి గుడ్ న్యూస్.. నల్లమల మీదుగా కొత్త ఎలివేటెడ్ కారిడార్.. అక్కడ ఐకానిక్ బ్రిడ్జి..
Srisailam Elevated Corridor
Venkatrao Lella
|

Updated on: Nov 14, 2026 | 9:53 PM

Share

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఊరట కలగనుంది. శ్రీశైలంకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. దీనికి సంబంధించి తాజాగా మరో మురో ముందడుగు పడింది. అటవీశాఖ పర్యవేక్షణలో సర్వే ప్రక్రియ చేపట్టారు. ఈ నెలాఖరుకు సర్వే పూర్తి కానుంది. నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. మార్కాపురం జిల్లాలోని దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. దీని ద్వారా రాత్రి వేళల్లో కూడా శ్రీశైలంకు చేరుకోవచ్చు. దాదాపు 43 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మించనున్నారు.

నల్లమల మీదుగా ఎలివేటెడ్ కారిడార్

శ్రీశైలం వెళ్లాలంటే నల్లమల అడవి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో జంతువుల సంరక్షణ, వాటి భద్రత కారణంగా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేసి ఉంటుంది. ఏపీ పరిధిలో పెద్దదోర్నాలలోని గణపతి అటవీ చెక్‌పోస్టు నుంచి నంద్యాల జిల్లాలోని లింగాల గట్టు వరకు దాదాపు 52.90 కిలోమీటర్ల మేర ఈ ఘాట్ రోడ్డు అనేది ఉంటుంది. దీంతో రాత్రి వేళల్లో కూడా శ్రీశైలంకు భక్తులు వెళ్లేలా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇటీవల శ్రీశైలంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

సర్వే పనులు ముమ్మరం

ఈ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, నెక్కంటి అటవీ రేంజ్‌ పరిధిలో సర్వే పూర్తి అవ్వగా.. ప్రస్తుతం దోర్నాల రేంజ్‌ పరిధిలో సర్వే పనులు జరుగుతున్నాయి. ఏపీ నుంచి శ్రీశైలానికి వెళ్లేవారు దోర్నాల నుంచి పులుల అభయారణ్య మీదుగా  వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు దోర్నాల నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు ఇరువైపులా ఇది ఉంటుంది. డ్యామ్ దగ్గర ఐకానిక్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్లాన్ రూపొందిస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టనున్నారు. వీలైనంత త్వరగా ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేయాలనే అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇది పూర్తయితే శ్రీశైలంకు వెళ్లేవారికి భారీ ఉపశమనం లభించనుంది. ఇక ఎప్పడైనా దీని ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు.  ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్దదోర్నాల గణపతి చెక్‌ పోస్టు నుంచి చింతల, తుమ్మలబైలు మీదుగా శ్రీశైల వరకు బ్రిడ్జి నిర్మించనున్నారు. సున్నిపెంట నుంచి కాకుండా బైపాస్‌ రోడ్డు వేయనున్నారు. దీని వల్ల శ్రీశైలం వెళ్లేవారికి మెరుగైన ప్రయాణ సౌకర్య లభించనుంది.

Follow Us