AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ హోంగార్డ్‌పై మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుజైని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (జూలై 26) శాంతిభద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్‌పై నడిరోడ్డుపై దాడి జరిగింది. కార్గిల్ పెట్రోల్ పంప్ సమీపంలో, జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ!
Woman Assaults Homeguard
Balaraju Goud
|

Updated on: Jul 26, 2026 | 11:59 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ హోంగార్డ్‌పై మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుజైని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (జూలై 26) శాంతిభద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్‌పై నడిరోడ్డుపై దాడి జరిగింది. కార్గిల్ పెట్రోల్ పంప్ సమీపంలో, జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ హోంగార్డ్ యూనిఫాంను పట్టుకుని తీవ్రంగా వాగ్వాదం చేస్తూ కనిపించింది. అనంతరం అతడిపై చెంపదెబ్బలు కొడుతూ, తన్నుతూ, పిడిగుద్దులతో దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో రహదారిపై భారీగా జనం గుమిగూడారు. పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఘర్షణ కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటనకు అసలు కారణంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనను హోంగార్డ్ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని మహిళ ఆరోపిస్తోంది. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం రోడ్డు ప్రమాదం కారణంగా ఈ వివాదం మొదలైందని తెలుస్తోంది. ప్రమాదం అనంతరం ఆగ్రహానికి గురైన మహిళ హోంగార్డ్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వైరల్ వీడియోలో మహిళ ముఖం ముసుగుతో కప్పుకుని ఉండటంతో ఆమెను గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం పోలీసులు వీడియో ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, వైరల్ వీడియోను కీలక ఆధారంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోంగార్డ్‌పై దాడి ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..