Abhishek Sharma : హరారేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
Abhishek Sharma : జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ బౌలింగ్‌లో మెరిసి 3 వికెట్లు తీశాడు. టీ20ల్లో ఓపెనర్‌గా ఒకే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించి, వీరేంద్ర సెహ్వాగ్ 14 ఏళ్ల నాటి రికార్డును సమం చేశాడు.

Abhishek Sharma : జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన రెండో టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో సంచలనం సృష్టించాడు. బ్యాటింగ్‌లో కేవలం 8 బంతుల్లో 8 పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం ఊహించని రీతిలో అదరగొట్టాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతిని అభిషేక్‌కు అందించగా, తన స్పిన్ మ్యాజిక్‌తో జింబాబ్వే బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అత్యంత విజవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
3 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఓపెనర్
అభిషేక్ శర్మ కేవలం 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లను నేలకూల్చాడు. జింబాబ్వే ప్లేయర్లు బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ నమహురి, రిచర్డ్ నగారవాలను వరుసగా పెవిలియన్ చేర్చాడు. టి20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో అభిషేక్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అంతేకాకుండా టి20 ఇంటర్నేషనల్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒకే మ్యాచ్‌లో 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.
14 ఏళ్ల తర్వాత సెహ్వాగ్ రికార్డు సమం
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు కలిపి) ఒకే మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 3 వికెట్లు తీసిన రెండో భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. అంతకుముందు టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. సెహ్వాగ్ సరిగ్గా 14 ఏళ్ల క్రితం, అంటే 26 ఫిబ్రవరి 2012న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి 43 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు అభిషేక్ శర్మ ఒక ఓపెనర్‌గా అంతర్జాతీయ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సెహ్వాగ్ అరుదైన రికార్డును రీసెంట్ మ్యాచ్‌లో రిపీట్ చేశాడు.
భారత్‌కు భారీ విజయం
వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 3 వికెట్లు తీసినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. కానీ అభిషేక్ శర్మ చేసిన ఈ బౌలింగ్ ప్రదర్శన టీమిండియా విజయానికి ఎంతగానో దోహదపడింది. అభిషేక్ దెబ్బకు జింబాబ్వే కోలుకోలేకపోయింది. ఈ రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేను ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఓడించి, సిరీస్‌లో శుభారంభం చేయడంతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మొదటి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
