AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద, ఇంట్లో సంతోషం!

వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో చేపల అక్వేరియం ఏర్పాటు చేస్తే ఇంటికి సానుకూల శక్తి, సంపద, ప్రశాంతత లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలు అక్వేరియంకు అనుకూలమైనవిగా భావిస్తారు. అయితే వంటగది, దక్షిణ దిశ, ఇంటి మధ్యభాగంలో అక్వేరియం ఉంచకూడదని సూచిస్తున్నారు.

SN Pasha
|

Updated on: Jun 07, 2026 | 10:42 AM

Share
ఇటీవలి కాలంలో ఇంటి అందాన్ని పెంచడంతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చాలా మంది ఫిష్ అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అక్వేరియం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల శక్తి, సంపద, ఆనందాన్ని తీసుకువచ్చే శక్తివంతమైన అంశంగా కూడా పరిగణించబడుతుంది. సరైన దిశలో, సరైన పద్ధతిలో అక్వేరియంను ఏర్పాటు చేస్తే కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

1 / 5
వాస్తు, ఇంటీరియర్ కన్సల్టెంట్ ఆర్నా జై మదన్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్వేరియంలో ప్రవహించే నీరు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. చేపలు ప్రతికూల శక్తులను తొలగించి ప్రశాంతతను కలిగిస్తాయని నమ్మకం. ముఖ్యంగా అక్వేరియంను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశల్లో ఉంచడం శ్రేయస్కరంగా భావిస్తారు. లివింగ్ రూమ్‌లో ఆగ్నేయ దిశలో ఉంచడం కూడా అనుకూల ఫలితాలను ఇస్తుందని వాస్తు సూచిస్తోంది.

2 / 5
అయితే అక్వేరియం ఏర్పాటు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వంటగదిలో చేపల తొట్టిని ఉంచకూడదు. వంటగది అగ్ని తత్వానికి, అక్వేరియం జల తత్వానికి సంకేతం కావడంతో ఈ రెండు తత్వాల మధ్య ఘర్షణ ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఇంటి మధ్యభాగం, దక్షిణ దిశ, మెట్ల కింద లేదా నేరుగా ఎండ తగిలే కిటికీల దగ్గర కూడా అక్వేరియం ఏర్పాటు చేయకూడదని సూచిస్తున్నారు.

3 / 5
కార్యాలయాల్లో కూడా అక్వేరియాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉన్న రిసెప్షన్ ప్రాంతంలో ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఉద్యోగుల్లో ఏకాగ్రతను పెంచడంతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అక్వేరియం నిర్వహణ కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒకటి లేదా రెండు వారాలకు నీటిలో 15 నుంచి 25 శాతం వరకు మార్చడం, ట్యాంక్‌లో మొక్కలను పెంచడం, ఫిల్టర్లు, పంపులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడం అవసరం. అదనపు ఆహారాన్ని తొలగించడం ద్వారా నీరు కలుషితం కాకుండా చూడాలి.

4 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం రోజున చేపలను కొనుగోలు చేసి అక్వేరియంలో ప్రవేశపెట్టడం శుభప్రదంగా భావిస్తారు. సరైన స్థలంలో, సరైన సంరక్షణతో చేపల అక్వేరియం ఏర్పాటు చేస్తే ఇంట్లో సానుకూల వాతావరణం, ప్రశాంతత, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవన్నీ సాంప్రదాయ వాస్తు విశ్వాసాలపై ఆధారపడిన సూచనలేనని, వాటికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

5 / 5
Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!