Tollywood: తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమానే.. కానీ చాలామందికి ఫేవరెట్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ నటుడు ఢిల్లీలో పుట్టి పెరిగాడు. అక్కడే ఉన్నత చదువులు కూడా చదివాడు. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు.ఆ తర్వాత యాక్టింగ్ లో డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశాడు. ఆపై వర్జిన్ మొబైల్, బిర్లా సన్ లైఫ్, ఫిడిలిటీ మ్యూచువల్ ఫండ్స్ తదితర బ్రాండ్ల ప్రకటనల్లో నటించి బాగా ఫేమస్ అయ్యాడు.

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న యువకుడిని గుర్తు పట్టారా? ఇప్పుడతను బాగా ఫేమస్. ట్యాలెంటెడ్ యాక్టర్. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగనీ అతను తెలుగులో పెద్దగా సినిమాలేవీ చేయలేదు. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క సినిమాలో యాక్ట్ చేశాడు. ఢిల్లీకి చెందిన ఇతను ఉన్నత చదువులు అభ్యసించాడు. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ అందుకున్నాడు. ఆ తర్వాత పూణేలోని ఎఫ్టీఐఐ నుంచి నటనలో రెండేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసాడు. మోడల్ గా ఎంట్రీ ఇచ్చి వర్జిన్ మొబైల్, బిర్లా సన్ లైఫ్, ఫిడిలిటీ మ్యూచువల్ ఫండ్స్ వంటి బ్రాండ్ల ప్రకటనల్లో నటించాడు. అయితే వీటివల్ల అతనికి డబ్బు వచ్చింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఒకే ఒక్క వెబ్ సిరీస్ ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. అందులో విలన్ గా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ, పచ్చి బూతులు తిడుతూ అతను పంచిన వినోదం యువతను బాగా ఆకట్టుకుంది. దెబ్బకు నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఇటీవలే రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన ఓ తెలుగు సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. హీరోగా కాకపోయినా చేతికి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తన ఇంటెన్స్ యాక్టింగ్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడీ నటుని పేరు తెగ మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ ఇతని నామస్మరణే వినిపిస్తోంది.
పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ మున్నాభాయ్ అలియాస్ దివ్యేందు శర్మ. రామ్ చరణ్ హీరోగా ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు దివ్యేందు. రాం బుజ్జీ అనే రోల్ లో తన దైన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో దివ్యేందుకు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ఆదర్శ కుటుంబంలో మున్నాకు ఓ కీలక పాత్ర దక్కిందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నరు.
పెద్ది సినిమాలో దివ్యేందు అలియాస్ మున్నా..
View this post on Instagram
కాగా హిందీలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు దివ్యేందు. ప్యార్ కా పంచనామా, ఛష్మే బద్దూర్, టాయ్ లెట్ ఏక్ ప్రేమ్‌కథ, థాయ్ మసాజ్, మాడ్ గావ్ ఎక్స్ ప్రెస్, అగ్ని తదితర సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ పోషించాడు. అలాగే రైల్వే మెన్, లైఫ్ హిల్ గయ్, బిక్కూ కా ఖేల్ వంటి సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




