రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ!
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా క్యాష్, నగలను ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రాయిని రాములు కుటుంబ సభ్యులు ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వేరే ఊరికి వెళ్లారు. అదే అదునుగా భావించిన దుండగులు, వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
బీరువాలో ఉన్న సుమారు 120 తులాలకు పైగా బంగారు ఆభరణాలతో పాటు, ఒక కిలో వెండిని అపహరించుకుపోయారు. ఉదయం ఇంటి పనిమనిషి వచ్చి చూడగా.. తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి యజమానులకు, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగుచూసింది.
దొంగలు రాములు ఇంటితో పాటూ గ్రామంలోని మరో మూడు ఇళ్లలో కూడా చోరీలు చేసారు. మాణిక్యరెడ్డి ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. గ్రామంలో ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్ కావాలంటున్న స్టార్స్!
భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

