Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పల్‌ టు ఉప్పుగల్‌ బైక్‌ ర్యాలీ.. కల్లుగీత కార్మికుల నిరసనతో హోరెత్తిన జాతీయ రహదారి

తమ సమస్యలు పరిష్కరించాలంటూ కల్లుగీత కార్మికులు రోడ్డెక్కారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి జనగాం జిల్లా ఉప్పుగల్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ..

ఉప్పల్‌ టు ఉప్పుగల్‌ బైక్‌ ర్యాలీ.. కల్లుగీత కార్మికుల నిరసనతో హోరెత్తిన జాతీయ రహదారి
Tadi Labour Bike Rally
Follow us
K Sammaiah

|

Updated on: Mar 19, 2021 | 7:53 AM

తమ సమస్యలు పరిష్కరించాలంటూ కల్లుగీత కార్మికులు రోడ్డెక్కారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి జనగాం జిల్లా ఉప్పుగల్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 18 రోజులుగా తమకు న్యాయం చేయాలంటూ దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నిరసన ర్యాలీ చేపట్టారు.

రిజర్వాయర్ పనులను అడ్డుకుని నిరాహార దీక్షలు చేపట్టిన గీతకార్మికులకు సంఘీభావం తెలిపేందుకు ఉప్పల్ ఎక్స్ రోడ్ టు ఉప్పుగల్లు వరకు. 200 బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ పాపన్న జనజాతర సమితి, ఉప్పుగల్లు గౌడ కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో రిజర్వాయర్ నిర్మాణంలో పూర్తిగా ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గత 18 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గౌడ సంఘానికి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్డు టూ ఉప్పుగల్ పాపన్న జన సమితి గౌడ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఉప్పుగల్లునిరసన దీక్షలకు చేరుకొని సంఘీభావం తెలిపారు.

అనంతరం పాపన్న జనజాతర సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉప్పుగల్ గౌడ సంఘం గొంతెమ్మ కోరికలు ఏమికోరడం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరసన దీక్షలు చేస్తే ఏఒక్కరు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 24 గంటల్లో పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

గతంలో శంకుస్థాపనను అడ్డుకున్న గీత కార్మికులు వరంగల్‌ జిల్లా జఫర్‌గఢ్‌ మండలంలో ఉప్పుగల్లు రిజర్వాయర్‌ శంకుస్థాపన గతంలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. రిజర్వాయర్‌ వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు ప్రారంభించవద్దంటూ గతంలోనే శంకుస్థాపనకు గీత కార్మికులు అడ్డుతగిలారు. ఒకవైపు గీత కార్మికులు నిరసన వ్యక్తం చేస్తుండగానే నాటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్‌ రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు.

దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఉప్పుగల్లు గ్రామాన్ని ఆనుకొని రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణ వల్ల ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములతో పాటు గీత కార్మికుల తాటి చెట్లు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే ముంపునకు గురయ్యే భూములపై సర్వే నిర్వహించడంతో పాటు భూములు కోల్పోయే కొంతమంది రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చింది. అయితే తాటిచెట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.

ఈ విషయం తేలకుండానే ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మాణ పనులను ప్రారంభించింది. దీంతో గీత కార్మికులు పెద్ద సంఖ్యలో మోకు ముత్తాదులతో నిరసన చేపట్టారు. తాటి చెట్ల వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Read More:

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు.. నూతన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ