సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు.. నూతన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. రూ.2,30,825.96 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. కరోనా కష్టకాలం తర్వాత ప్రవేశపెట్టిన..

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు.. నూతన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ
Kcr Kshirabhishekam
Follow us
K Sammaiah

|

Updated on: Mar 19, 2021 | 7:25 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. రూ.2,30,825.96 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. కరోనా కష్టకాలం తర్వాత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది కేసీఆర్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగా అన్ని వర్గాలు, కులాల వారిగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తున్నాయి.

ఈ బడ్జెట్ లో జిల్లా, మండల పరిషత్ లకు 500 కోట్లు కేటాయించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో జనగాం జిల్లా కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు పాల్గొని సియం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి అన్ని వర్గాలకు సమ న్యాయం చేశారని కొనియాడారు.

అటు పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల , కొడకండ్ల , పాలకుర్తి , రాయపర్తి మండలాలలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, పాటాకులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ అంటూ నినాదాలు చేశారు. బడ్జెట్‌ రూపొందించిన విధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలపై ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం ముందుకు వెళుతుండటం హర్షనీయమన్నారు. కరోనా తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి రంగానికి అధిక నిధులు కేటాయించడంతో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లో ఎక్కడా కోతల్లేవు.. పన్ను మోతల్లేవు.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి భారీ గా కేటాయింపులు.. ఒక్క మాటలో చెప్పాలంటే… రైతు, పల్లె, పట్నం ప్రగతికి బాటలు వేస్తూ, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర సర్కారు బడ్జెట్‌ను ముందుకు తెచ్చిందని అంటున్నారు.

కరోనా ఆర్థికంగా దెబ్బకొట్టినా సీఎం కేసీఆర్‌ ముందు చూపు, పరిపాలనా దక్షత కష్ట కాలంలో ప్రజలకు శ్రీరామరక్షగా మారిందని గులాబీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. వైద్య, విద్యా రంగాలకు ప్రాధాన్యమిస్తూనే.. సీఎం దళిత సాధికారత పేరుతో దళితుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించడం హర్షనీయమన్నారు. మొత్తానికి తెలంగాణ బడ్జెట్‌ పట్ల అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More:

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కరోనా ఎఫెక్ట్.. అయినా భారీ బడ్జెట్‌.. ఏయే శాఖకు ఎంతెంత కేటాయించారంటే..

టీఆర్‌ఎస్‌ వైపే నిలిచిన పట్టభద్రులు.. తెలంగాణలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన గులాబీ దళం