Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్‌ఎస్‌ వైపే నిలిచిన పట్టభద్రులు.. తెలంగాణలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన గులాబీ దళం

తెలంగాణలో గులాబీ పార్టీ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తాజగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. పోటాపోటీగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ..

టీఆర్‌ఎస్‌ వైపే నిలిచిన పట్టభద్రులు.. తెలంగాణలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన గులాబీ దళం
Follow us
K Sammaiah

|

Updated on: Mar 18, 2021 | 1:29 PM

తెలంగాణలో గులాబీ పార్టీ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తాజగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. పోటాపోటీగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుంది. దీంతో గులాబీ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో క్యాడర్‌ నిరుత్సాహంతో ఉంది. తెలంగాణలో తొలి నుంచి అప్రతిహతంగా దూసుకెళుతున్న టీఆర్‌ఎస్‌కు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు కారు పార్టీకి బూస్ట్‌గా ఉపయోగపడతాయని గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికలో వికసించిన కమలం పార్టీ అదే ఊపుతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలో గులాబీ పార్టీని ఢీ కొట్టింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 48 స్థానాలకు గెలుచుకుని టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరింది. 2023 ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ దూసుకెళుతున్న క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ నేతలు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. కీలక నేతలంగా రంగంలోకి దిగి తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణిదేవి గెలుపు దాదాపు ఖాయమైపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రతిపక్షాల ఆశలు పట్టభద్రులు అడియాశలు చేశారు. అధికార పార్టీకే ఓటేశారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలకు బదులు తీర్చుకున్నామనే టాక్‌ అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది.

ఇక నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆ స్థానంపైనా గులాబీ దళం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. తాజా ఫలితాలు ఆ ఉప ఎన్నికకు ఓ బూస్ట్‌లా ఉపయోగపడతాయిని టీఆర్ఎస్‌ నేతలు భావిస్తున్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారనడానికి తాజా ఫలితాలే ఉదాహరణ అని అంటున్నారు.

Read More:

మూడోరౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..

బడ్జెట్‌లో పంచాయతీరాజ్ శాఖకు రూ.29, 271 కోట్ల కేటాయింపులు.. మరింత ముమ్మరంగా గ్రామీణాభివృద్ధి-పల్లె ప్రగతి