మూడోరౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో..

మూడోరౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..
Follow us
K Sammaiah

|

Updated on: Mar 18, 2021 | 1:04 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్‌ మొదలైన మొదటి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనబరుస్తూ వస్తుంది. తాజాగా మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడు రౌండ్ లలో టీఆరెస్ అభ్యర్థి పల్లా ముందంజలో ఉన్నారు. నల్గొండలోని మార్కెటింగ్ గోదాంలో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మొదటి స్థానం లో టీఆరెస్ అభ్యర్థి “పల్లా రాజేశ్వర్ రెడ్డి” పోలైన ఓట్లు మొదటి రౌండ్ 16130 రెండో రౌండ్ 15857 మూడో రౌండ్ 17393 మూడు రౌండ్ల మొత్తం 49380 మూడో రౌండ్ లలో తీన్మార్ మల్లన్న పై ఆధిక్యం 12142 ఓట్లు

రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి “తీన్మార్ మల్లన్న”(నవీన్) మొదటి రౌండ్: 12,046 రెండో రౌండ్ :12070 మూడో రౌండ్ :13122 మూడు రౌండ్ ల మొత్తం 37238

మూడో స్తానం లో తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొపెసర్ “కోదండరాం” మొదటి రౌండ్ 9080 రెండో రౌండ్ 9448 మూడో రౌండ్ 11907 మూడు రౌండ్ ల మొత్తం 30435

నాలుగో స్తానం లో బీజేపీ అభ్యర్థి “ప్రేమేంధర్ రెడ్డి” మొదటి రౌండ్ 6615 రెండో రౌండ్ 6669 మూడో రౌండ్ 6669 మూడు రౌండ్ ల మొత్తం 19953

ఐదో స్తానం లో కాంగ్రెస్ అభ్యర్థి “రాములు నాయక్” మొదటి రౌండ్ 4354 రెండో రౌండ్ 3244 మూడో రౌండ్ …… మొత్తం ……

రాణిరుద్రమరెడ్డి ఆరో స్థానంలో, చెరుకు సుధాకర్‌ ఏడో స్థానంలో, జయసారథిరెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.మొత్తం 12 కొత్త జిల్లాల పరిధిలో 3,85,996 ఓట్లు పోలయ్యాయి.ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు 1,92,999 ఓట్లు రావాల్సి ఉంది. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న ఈ ఫలితాల్లో.. ఓక్కో రౌండ్‌లో 56,000 వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు.నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

చెల్లని ఓట్లు మొదటి రౌండ్ 3151 రెండో రౌండ్ 3009 మూడు రౌండ్ లలో మొత్తం చెల్లని ఓట్లు వేసిన పట్టభద్రులు 8000 వేలకు పైగా ఉన్నారు.

Read More:

బడ్జెట్‌లో పంచాయతీరాజ్ శాఖకు రూ.29, 271 కోట్ల కేటాయింపులు.. మరింత ముమ్మరంగా గ్రామీణాభివృద్ధి-పల్లె ప్రగతి