మావోయిస్టులను రెచ్చగొడుతున్న మమతా బెనర్జీ, పురూలియా ర్యాలీలో ప్రధాని మోదీ ఆరోపణ, బెంగాల్ లో ఇక అధికారం మాదేనని వ్యాఖ్య
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మావోయిస్టులను రెచ్ఛగొడుతున్నారని, వారితో చేతులు కలుపుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మావోలకు సంబంధించి కొత్త బ్రీడ్ ను సృష్టించారని ఆయన అన్నారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మావోయిస్టులను రెచ్ఛగొడుతున్నారని, వారితో చేతులు కలుపుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మావోలకు సంబంధించి కొత్త బ్రీడ్ ను సృష్టించారని ఆయన అన్నారు. గురువారం పురూలియాలో జరిగిన తమ పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తూ..వీరు ప్రజాధనాన్ని దోచుకుంటారని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ని ఆయన ‘ టీఎంసీ’.ని . ట్రాన్స్ ఫర్ మై కమిషన్’ అన్నట్టుగా అభివర్ణించారు. (అంటే నా కమీషన్ ని బదిలీ చేయండి’ అన్నదే). మమతా తన ఫ్రస్టేషన్ ని నా మీద ప్రదర్శిస్తున్నారని, కానీ దీనివల్ల ప్రయోజనం లేదని అన్నారు.కానీ తనకు ఆమె ఈ దేశంలోని కోట్లాది కూతుళ్లతో ఒకరని, వారిని తాను ఎంతో గౌరవిస్తానని చెప్పారు. ‘ ఆట మొదలైందన్న’ మమత వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఆయన.. ‘దీదీ ! ఓ దీదీ !మీరు పదేళ్లు ఆడారు.. ఇక ఆట ముగిసి అభివృధి ప్రారంభమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగి, అభివృద్ధి కుంటుపడిందని ఆయన దుయ్యబట్టారు. మీరు ఆట మొదలైందని అంటున్నారు. కానీ మేము ఆట అంటే అభివృద్ధి, జాబ్స్, విద్య, మహిళాభ్యున్నతి వంటి రంగాలను పేర్కొంటున్నామని ఆయన చెప్పారు. ఈ రంగాల్లో ఇక ఆట మొదలవుతుందని అన్నారు.పురూలియాలో గిరిజన తెగ ప్రజలు ఎక్కువగా ఉన్న విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. వీరి అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందో తానూ తెలుసుకోగోరుతున్నానని చెప్పారు. తన పదేళ్ల అపసవ్య పాలనకు గాను తృణమూల్ కాంగ్రెస్ ను ప్రజలు శిక్షిస్తారని అన్నారు.
గాయపడిన దీదీ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తానని మోదీ అన్నారు. పదేళ్ల పాటు మీరు బుజ్జగింపు రాజకీయాలు నడిపారని, ప్రజలపై లాఠీలు ప్రయోగించారని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్ర ఎన్నికల తరువాత సిండికేట్ రాజ్యం అంతమవుతుందన్నారు. బొగ్గు, ఇసుక మాఫియాలో ఎవరెవరి పాత్ర ఉందో, వారిని ఎవరు కాపాడుతున్నారో ప్రజలకు తెలుసునన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : కదులుతున్న కారులోంచి పడిపోయిన చిన్నారి..షాక్ అవుతోన్న నెటిజెన్ల : child fell out in running car video
ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.