AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! మీ అకౌంట్లో డబ్బులు జమ?

EPFO తన 30 కోట్ల మంది సభ్యులకు మెరుగైన రాబడులు అందించడానికి కొత్త పెట్టుబడి వ్యూహాలపై దృష్టి సారించింది. అధిక లాభాల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను పెంచడం ద్వారా సభ్యుల ఖాతాల్లో అదనపు వడ్డీ, లాభాలు చేరవచ్చు.

SN Pasha
|

Updated on: Feb 20, 2026 | 11:30 PM

Share
కోట్లాది మంది EPFO సభ్యులకు శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి విధానాన్ని మరింత మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తోంది. మంచి రాబడులు వచ్చే పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. TIO నివేదికల ప్రకారం.. ఈ కమిటీ EPFO పెట్టుబడుల పనితీరును సమీక్షించి, మరింత లాభదాయక మార్గాలను సూచించనుంది.

1 / 5
ప్రస్తుతం EPFO సుమారు 30 కోట్లకు పైగా సభ్యుల నిధులను నిర్వహిస్తూ, దాదాపు రూ.31 లక్షల కోట్ల ఫండ్‌ను చూసుకుంటోంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈక్విటీ మార్కెట్‌లు, ETFల్లో పెట్టుబడులను పెంచాలా అనే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడుల ద్వారా అధిక ఆదాయం సాధ్యమైతే, సభ్యుల ఖాతాల్లో వడ్డీతో పాటు అదనపు లాభం జమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

2 / 5
సమావేశానికి ప్రభుత్వ ప్రతినిధి హాజరై కమిటీ ఏర్పాటు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను కూడా చేర్చే యోచన ఉంది. 2015 ఏప్రిల్ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం EPFO పెట్టుబడులు వివిధ వర్గాల్లో విభజించబడ్డాయి. అందులో 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–25 శాతం కార్పొరేట్ బాండ్లలో, 5 శాతం వరకు స్వల్పకాలిక పథకాలలో పెట్టుబడి పెట్టబడుతున్నాయి. అలాగే 5–15 శాతం వరకు ఇండెక్స్ ఫండ్లు, ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు ఉన్నాయి.

3 / 5
అధికారుల సమాచారం ప్రకారం.. గత డిసెంబర్ 31 నాటికి EPFO తన మొత్తం నిధుల్లో దాదాపు 88 శాతం ప్రభుత్వ బాండ్లలో, 10.6 శాతం ఈక్విటీలలో పెట్టుబడి పెట్టింది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు PF తప్పనిసరి పొదుపు పథకం కాగా, ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతం EPFకు వెళుతుంది. కంపెనీ కూడా అదే మొత్తాన్ని చెల్లిస్తుంది. ఉద్యోగి వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS)కు మళ్లించబడుతుంది.

4 / 5
EPF ఖాతాలోని మొత్తంపై ప్రతి ఏడాది వడ్డీ చెల్లిస్తారు. ఇక సభ్యులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా EPFO టెక్నాలజీ సేవలను కూడా విస్తరిస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి UPI ద్వారా PF మొత్తాన్ని ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. త్వరలో ATM ద్వారా కూడా ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. అదనంగా, ఉమాంగ్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా లాగిన్ అయ్యే సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో EPFO సేవలు మరింత సులభతరం కానున్నాయి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!