‘పెద్దల మాట చద్దిమూట’ కవి ఆత్మహత్య.. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన మద్దా సత్యనారాయణ
ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగినట్లు..
ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగినట్లు తెలుస్తుంది. పెద్దల మాట చద్దిమూట, మద్దావారి మణిపూసలు, తరువోజ, బధిరుడు, పదవులున్నోళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేద్కర్ వంటి రచనలతో సామాజిక చైతన్యాన్ని రగిలించారు మద్దా సత్యనారాయణ.
తన రచనలు, కవితల ద్వారా సమాజాన్ని చైతన్య పరుస్తూనే మరోవైపు అక్షర సత్య సేవా సంస్థను ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న సత్యనారాయణను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు.
సత్యనారాయణ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కరప మండలంలోని గురజానపల్లి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైరయ్యారు. తనకిష్టమైన సాహిత్య రంగంలో ఉంటూ పలు రచనలు చేశారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.
Read More:
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు.. నూతన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ
దేశంలో ఇక టోల్ ప్లాజాలు ఉండవ్, ఇకపై జీపీఎస్ ఆధారిత కలెక్షన్ సెంటర్లే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ