దేశంలో ఇక టోల్ ప్లాజాలు ఉండవ్, ఇకపై జీపీఎస్ ఆధారిత కలెక్షన్ సెంటర్లే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఇండియాలో ఇక ఏడాదిలోగా టోల్ ప్లాజాలు ఉండబోవని, వీటి స్థానే పూర్తి జీపీఎస్ టోల్ కలెక్షన్ సెంటర్లను అమలులోకి తెస్తామని కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఇండియాలో ఇక ఏడాదిలోగా టోల్ ప్లాజాలు ఉండబోవని, వీటి స్థానే పూర్తి జీపీఎస్ టోల్ కలెక్షన్ సెంటర్లను అమలులోకి తెస్తామని కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఫాస్టాగ్ ను ఉపయోగించి 97 శాతం వాహనాలు టోల్ ఫీజును చెల్లిస్తాయని, మిగతా 7 శాతం డబుల్ టోల్చె ల్లించినా దీన్నిఇంకా తీసుకోలేదని ఆయన చెప్పారు. మరో ఏడాది లోగా దేశంలో టోల్ ప్లాజాలను తొలగించడం జరుగుతుందని ఆయన గురువారం లోక్ సభలో తెలిపారు. ఇక టోల్ కలెక్షన్ జీపీఎస్ ద్వారా జరుగుతుందని, దీని ఆధారంగా చెల్లింపులు ఉంటాయన్నారు. ఫాస్టాగ్ ను వినియోగించి ఫీజు చెల్లించని వాహనాలపై ఎంక్వయిరీ జరపాలని తాను పోలీసు శాఖను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. వాహనాల్లో ఫాస్టాగ్స్ ను ఫిట్ చేయని పక్షంలో జీ ఎస్ టీ ఎగవేత, టోల్ ఫీజుల స్వాహా వంటి కేసులు ఉన్నాయన్నారు.టోల్ ప్లాజాల వద్ద ఎలెక్ట్రానిక్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ సౌలభ్యాన్ని 2016 లో ప్రవేశ పెట్టారు. ఫాస్టాగ్ లేని వాహనాలు డబుల్ టోల్ ఫీజునుచెల్లించాలన్న విధానాన్ని ఫిబ్రవరి 16 నుంచి ప్రవేశపెట్టారు.
కొత్త వాహనాలకు ఫాస్టాగ్ ఫిట్ చేసి ఉంటుందని, అలాగే పాత వాహనాలకు ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం ఉచితంగానే కల్పిస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. కాగా ఏడాదిలో గా టోల్ ప్లాజాలను తొలగించాలన్న ప్రతిపాదనపై విధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. జీ పీ ఎస్ కలెక్షన్ సెంటర్ల విధానం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా ఉందని అంటున్నారు. ప్రజలకు దీన్ని అలవాటు చేయాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా గల టోల్ ప్లాజా లలో పని చేస్తున్న సిబ్బంది భవితవ్యం మరి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి: Cotton Dresses : ఎండాకాలంలో ఏ దుస్తులు బెటర్..? కారిపోతున్న చెమటలు.. ఉక్కపోతను తట్టుకోవాలంటే ఇవి తప్పనిసరి..
Virata Parvam Movie : యదార్ధ సంఘటనల ఆధారంగా విరాటపర్వం… ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్