Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila : కాళేశ్వరం గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరు తోడుంటే ఎంతటి కొండనైన ఢీ కొట్టేందుకు నేను రెడీ : షర్మిల

YS Sharmila : 'కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.. కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ..

YS Sharmila : కాళేశ్వరం గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరు తోడుంటే ఎంతటి కొండనైన ఢీ కొట్టేందుకు నేను రెడీ : షర్మిల
YS Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 18, 2021 | 4:19 PM

YS Sharmila : ‘కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.. కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుంది’ అని వైఎస్‌ షర్మిల అన్నారు. యావత్ తెలంగాణకు కరీంనగర్ అద్దం పడుతుందని ఆమె వెల్లడించారు. ‘సిటీ ఆఫ్ ఎనర్జీ’ మన రామగుండం అని ఆమె చెప్పుకొచ్చారు. ‘సింగరేణి మనకు తలమానికం.. అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు. నారాయణ రెడ్డి, గిద్దే రాములు ఇక్కడి రాములు. అని షర్మిల అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయి, తెలంగాణలో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియలో చురుగ్గా అడుగులు వేస్తున్న షర్మిల ఇవాళ కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో హైదరాబాద్‌ లోటస్ పాండ్ ఆఫీస్‌లో ఆత్మీయ సమ్మేళనం జరిపారు.

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి – కరీంనగర్ జిల్లాకు విడదీయరాని బంధం ఉందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్.. ఉచిత విద్యుత్ పథకం ఇచ్చింది కూడా కరీంనగర్ జిల్లా రైతుల కష్టాలు చూసేనని ఆమె చెప్పుకొచ్చారు. ‘సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. లక్షన్నర చొప్పున కుటుంబానికి పరిహారం ఇప్పించారు. బ్యాంకుల ద్వారా నేతన్నలకు రుణాలు ఇప్పించారు. కరీంనగర్ జిల్లా ‘రైస్ బౌల్’ అని అనడానికి రాజశేఖర్ రెడ్డే కారణం అని షర్మిల వెల్లడించారు.

ఎల్లంపల్లి, మిడ్ మనేర్ కట్టించిన ఘనత వైఎస్సార్ దేనని షర్మిల అన్నారు. ‘శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు. రాజీవ్ రహదారి రామగుండం వరకు నిర్మించిన ఘనత వైఎస్సార్ ది. కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్ పాత్ర చాలా ఉంది. ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చిన వారి త్యాగం వెల కట్టలేనిది’. అని షర్మిల చెప్పారు. ‘ఎకరాకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని ఆమె టీఆర్ఎస్ సర్కారుని పరోక్షంగా ప్రశ్నించారు.

‘నేరెళ్ళలో ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. దళితులపై పాలకులకు ఏ మాత్రం ప్రేమ ఉందో దీనిని చూస్తే అర్థం అవుతుంది.. పెద్దపల్లి న్యాయవాదుల హత్యపై అధికార పార్టీ హస్తం ఉండటం దారుణం. బొంబాయి, దుబాయ్ కి వలసలు ఆగిపోలేదు’ అని షర్మిల కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాదు, కేసీఆర్ సర్కారు బీడీ కార్మికులను పట్టించుకోలేదని చెప్పిన ఆమె, ‘నా సంకల్పం ఒక్కటే.. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలి. మీరు తోడు ఉంటే ఎంతటి కొండను అయినా ఢీ కొట్టదానికి నేను రెడీ’. అని షర్మిల ప్రకటించారు.

Read also : Balineni Srinivasulu Reddy : ‘చంద్రబాబు ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయ్.. వాటిపై కూడా త్వరలోనే విచారణ’