ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..
సాధారణంగా వర్షా కాలంలో ఉరుములు మెరుపులతో వానపడటం సహజం. ఒక్కోసారి ఈ ఉరుములు మెరుపులు చాలా భయంకరంగా ఉంటాయి. పెద్ద పెద్ద శబ్ధాలతో ఉరుములు ఉరుముతాయి. అలాంటప్పుడు ఎంతటి ధైర్యవంతులైనా భయపడతారు. మరీ పిరికివారు అర్జునా ఫల్గుణా.. అర్జునా ఫల్గుణా అంటూ నామజపం చేస్తారు.
ఇళ్లలో సురక్షితంగా ఉండే మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక చెట్లుచేమలపై ఉండే మూగజీవుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి పరిస్థితే ఓ ఉడుతకు ఎదురైంది. అప్పుడు ఆ ఉడుత ఏంచేసిందో చూస్తే అవాక్కవుతారు. ఓ ఉడుత ఓ చెక్క బాక్స్‌లో పడుకుని హాయిగా నిద్రపోతుంది. అదే సమంలో బయట పెద్దగా వర్షం పడుతోంది. అయినా ఉడుత చెక్కపెట్టెలో భద్రంగా ఉంది. చుక్కనీరు కూడా లోపలికి వెళ్లలేదు. దీంతో బేఫికర్ గా నిద్రపోతోంది. ఇంతలో పెద్ద ఉరుము ఉరిమింది. దెబ్బకు ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఉడుత. తు..తు.. అంటూ గుండెలమీద చేత్తో రాసుకుంటూ…అమ్మబాబోయ్… ఎంత పెద్ద ఉరుము.. ఎక్కడో పిడుగుపడినట్టుంది… ఇంకా నయం నా ఇంటిపైన పడలేదు అర్జునా..ఫల్గుణా అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అలా చాలాసేపు గుండెలపై చేత్తో రాసుకుంటూ మళ్ళీ ఎక్కడ ఉరుముతుందోనని ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. అలా కూర్చునే కాసేపటికి నిద్రలోకి చారుకుంది. ఉడుత ఎదురుగా ఎవరో కెమెరా ఏర్పాటు చేయడంతో ఈ వింత ఎక్స్‌ప్రెషన్ మొత్తం రికార్డ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెట్టింగ్ ఎఫెక్ట్! యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!
అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!
టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం

