అలర్ట్.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే మరో నాలుగు రైళ్లనను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చుతున్నట్టు మార్చి 11న దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో రీడెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు, ఇటు రైల్వే స్టేషన్ రీ డెవలప్‌మెంట్ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మేరకు మార్పులు చేపట్టారు.
రూ.720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధిని దశల వారీగా చేపడుతున్నామని వివరించింది. సికింద్రాబాద్‌నుంచి చర్లపల్లి టెర్మినల్‌కు మార్చిన రైళ్లలో తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి టెర్మినల్ నుంచి రాత్రి 8.10కి బయల్దేరుతుంది. బొల్లారం స్టేషన్‌లో రాత్రి 9.14కి ఆగుతుంది. ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు బొల్లారం స్టేషన్‌కు ఉదయం 4.29కి, చర్లపల్లికి 5.45కి వస్తుంది. మార్చి 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు ఉదయం చర్లపల్లి నుంచి 7.20కి బయల్దేరి, లింగంపల్లికి 9.15కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం 6.30కి బయల్దేరి చర్లపల్లికి 7.30కి చేరుతుంది. ఈ మార్పు ఏప్రిల్ 2 నుంచి జులై 1 వరకు అమల్లో ఉంటుంది. కాజీపేట-హదాప్పర్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లికి రాత్రి 8.20కి వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు చర్లపల్లికి తెల్లవారుజామున 3 గంటలకు వస్తుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.15కి చర్లపల్లికి వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుతుంది. ఈ మార్పు ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..
బెట్టింగ్ ఎఫెక్ట్! యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

