AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే హోటల్ స్టైల్ పూరీలు చేయండిలా..! సింపుల్ టిప్స్ తో టేస్టీ రెసిపీ మీకోసం..!

ఇడ్లీ, దోసె లాంటి టిఫిన్‌ ఏకకాలంలో బోర్ అనిపిస్తే పూరీలు మంచి ఆప్షన్‌. పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా పూరీలు ఇష్టంగా తింటారు. కానీ చాలా మంది నూనె ఎక్కువ పీల్చేస్తుందనే భయంతో పూరీలు తినడానికి ఇష్టపడరు. హోటల్ లేదా రెస్టారెంట్లలో వాడే నూనె మళ్లీ మళ్లీ ఉపయోగిస్తారనే అనుమానంతో చాలా మంది పూరీలు ఆర్డర్ చేయడానికి కూడా ఇష్టపడరు.

ఇంట్లోనే హోటల్ స్టైల్ పూరీలు చేయండిలా..! సింపుల్ టిప్స్ తో టేస్టీ రెసిపీ మీకోసం..!
Poori Recipe
Prashanthi V
|

Updated on: Mar 17, 2025 | 6:54 PM

Share

ఇంట్లో పూరీలు చేసుకోవడంలో నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా ఉంది. పూరీలు పొంగి, క్రిస్పీగా రావాలంటే పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ కలపాలి. రవ్వ కలిపితే పూరీలు నూనె ఎక్కువ పీల్చకుండా చక్కగా పొంగుతాయి. పైగా పూరీలు ఎక్కువ సేపు మృదువుగా అలాగే ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి – 2 కప్పులు ఉప్మా రవ్వ – 3 స్పూన్లు పంచదార – 1 టీ స్పూన్ ఉప్పు – రుచికి సరిపడా నూనె – కొద్దిగా

తయారీ విధానం

ముందుగా పెద్ద గిన్నెలో గోధుమ పిండి, ఉప్మా రవ్వ, పంచదార, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో గోరు వెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలపాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా కొంచెం కొంచెం పోస్తే పిండి కుదురుతుంది. పిండిని అరగంట పాటు నానబెట్టాలి. ఈ సమయంలో రవ్వ వల్ల పిండి కాస్త గట్టిపడుతుంది. అందుకే పూరీలను గట్టిగా వత్తి పక్కన పెట్టాలి.

పూరీలు కాస్త మందంగా వత్తుకుంటే పూరీ సరిగా పొంగుతుంది. పలుచగా వత్తుకుంటే పూరీలు సరిగా పొంగవు. కాబట్టి కాస్త మందంగా వత్తి మంచి క్రిస్పీ పూరీలు రావడానికి ఈ పద్ధతి పాటించాలి.

పూరీలను కాల్చేటప్పుడు కడాయిలో పూరీలు మునిగిపోయేంత నూనె పోయాలి. మంట హై ఫ్లేమ్‌లో ఉండాలి. మంట తక్కువగా ఉంటే పూరీలు నూనె పీల్చి, సరిగా పొంగవు. పూరీలు వేసి అవి పైకి రాకుండా సున్నితంగా జల్లెడతో వత్తితే చాలు. పూరీలు సరిగ్గా పొంగి క్రిస్పీగా తయారవుతాయి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..