Mint health benefits: వారెవ్వా.. ప్రతి రోజూ పుదీనా తింటే ఇన్ని లాభాలా.? డాక్టర్ ఏం చెప్పారంటే..
Mint health benefits: పుదీనా వాసన చూస్తేనే మూడ్ రిఫ్రెష్ అవుతుంది. వంటల్లో మంచి రుచి, వాసన కోసం చాలా మంది పుదీనాను ఎక్కువగా వాడుతుంటారు. పుదీనా వంటల రుచిని పెంచడానికే కాదు..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ కొన్ని పుదీనా ఆకులు తినటం వల్ల పుట్టెడు లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే పుదీనాను ఆయుర్వేదంలో ఔషధ మూలికగా పిలుస్తారు. ఉబ్బసం, తలనొప్పి, నోటికి సంబంధించిన సమస్యలకు పుదీనా బెస్ట్ హోం రెమిడీగా పనిచేస్తుంది. దీని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
Updated on: Mar 17, 2025 | 7:23 PM

అలాగే, భోజనం తర్వాత ఒక కప్పు పుదీనా టీ తాగితే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో అసౌకర్యం తగ్గుతుంది. వికారం, వాంతులు వంటి సమస్యలను కూడా పుదీనా తగ్గిస్తుంది. బస్సు, కార్లు వంటి ప్రయాణాల్లో వికారంగా అనిపించేవారు పుదీనా ఆకులను నమలడం లేదా పుదీనా టీ తాగడం మంచిది.

పుదీనా: పుదీనా ఆకులు.. వీటి వాసన చూస్తేనే మూడ్ అంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. వంటల్లోనూ మంచి రుచి, వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు. పుదీనా వంటల టేస్ట్ పెంచడానికే కాదు.. మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొన్ని పుదీనా ఆకులు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీ, సాస్, స్వీట్లు మొదలైన వాటికి రుచి, సువాసన కోసం దీన్ని కలుపుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఉబ్బరం తగ్గిస్తుంది.

పుదీనా సువాసన మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. పుదీనా వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి, మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడితో కూడిన రోజు తర్వాత పుదీనా టీ తాగితే లేదా పుదీనా నూనెతో మర్దన చేసుకుంటే మీరు రిలాక్స్ అవుతారు.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు పుదీనా ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది, శ్వాసనాళాలను తెరిచి, శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఆస్తమాతో బాధపడేవారికి కూడా పుదీనా ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా ఆకుల ఆవిరి పీల్చడం లేదా పుదీనా నూనెను ఛాతీకి, వీపుకు రాయడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

Mint leaves




