Telangana MLC Election Results 2021 LIVE: హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి ఘన విజయం..

Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: Mar 22, 2021 | 12:13 PM

Telangana (Hyderabad) Graduate Elections Counting: తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓట్లను బుధవారం నుంచి

Telangana MLC Election Results 2021 LIVE: హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి ఘన విజయం..
Telangana Mlc Election Results

Telangana (Hyderabad) Graduate Elections Counting: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండోస్థానానికే పరిమితమయ్యారు. మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కే.నాగేశ్వర్, నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నిలిచారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓట్లను బుధవారం నుంచి లెక్కిస్తున్నారు. శనివారం నాలుగో రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు మూడో రోజు కొనసాగుతోంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి గెలుపునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికి స్పష్టతమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒక వేళ ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే ఎక్కువ ఓట్ల వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్‌తో పాటు జంబో బ్యాలెట్‌తో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్​తో పాటు జంబో బ్యాలెట్​తో కౌంటింగ్​ సవాల్​గా మారింది. దీంతో ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు సమయం  పడుతుందని భావించినా… ప్రస్తుతం మూడో రోజు కొనసాగుతోది. కాగా, మూడు షిప్టుల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.

కౌంటింగ్‌ కోసం ఒక్కో హాలులో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తున్నారు ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు 1000 చొప్పున 56వేల ఓట్లను లెక్కిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్‌ చేశాక, ఒక్కోటేబుల్‌కు 1000 ఓట్లు (40) బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌లో 56వేల ఓట్లను లెక్కించనుండగా, మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఫైనల్‌ రౌండ్‌ రిపోర్టు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఫైనల్‌ రౌండ్‌ రిపోర్టు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఫైనల్‌ రౌండ్‌ రిపోర్టు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఫైనల్‌ రౌండ్‌ రిపోర్టు

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Mar 2021 09:52 PM (IST)

    సీఎం కేసీఆర్‌ను కలిసిన వాణీదేవి

    హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంలో.. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె  ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వాణీదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

    Cm Kcr Vanidevi

  • 20 Mar 2021 09:41 PM (IST)

    పల్లాకు కంగ్రాట్స్ చెప్పిన మల్లన్న..

    నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపును అధికారులు మరికాసేపట్లో ప్రకటించనున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రంలో మల్లన్న పల్లాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 20 Mar 2021 09:31 PM (IST)

    నల్లగొండ: కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ

    కౌంటింగ్ కేంద్రంలో పల్లాకు మొదటగా కంగ్రాట్స్ చెప్పిన తీన్మార్ మల్లన్న. ఆప్యాయంగా స్వీకరించిన పల్లా రాజేశ్వరరెడ్డి.. మరో గంటలో పల్లా గెలుపును ప్రకటించనున్న అధికారులు..

  • 20 Mar 2021 07:28 PM (IST)

    విజయం దిశగా పల్లా రాజేశ్వరరెడ్డి..

    నల్గగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. రెండో ప్రధాన్యం ఓటు లెక్కింపులో కూడా ఆయనకు మెజారిటీ చేకూరుతోంది. మరి కాసేపట్లో విజయంపై ఫుల్ క్లారిటీ రానుంది.

  • 20 Mar 2021 07:25 PM (IST)

    నల్లగొండ: కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన మల్లన్న

    రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి ముందు వరుసలో దూసుకుపోతున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి నవీన్ అలియాస్ మల్లన్న కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.

  • 20 Mar 2021 07:22 PM (IST)

    నల్లగొండలో ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు..

    నల్గగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లన్న మధ్య హోరాహోరి పోరు నెలకొంది.

  • 20 Mar 2021 06:57 PM (IST)

    1,89,339 ఓట్లతో విజయం సాధించిన వాణీదేవి

    హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 189339 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై ఆమె విజయం సాధించారు.

    Vanidevi Votes

  • 20 Mar 2021 06:37 PM (IST)

    నల్లగొండ స్థానంలో కొనసాగుతున్న ఉత్కంఠ..

    నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల స్థానంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి మల్లన్న మధ్య హోరాహోరా పోటీ నెలకొంది.

  • 20 Mar 2021 06:19 PM (IST)

    సంబరాల్లో అపశృతి.. భవన్‌లో అగ్ని ప్రమాదం

    తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టపాసులు పేల్చుతుండగా.. భవన్ పై అంతస్తులో మంటలు అంటుకున్నాయి.

  • 20 Mar 2021 05:20 PM (IST)

    టీఆర్ఎస్ భవన్‌లో సంబరాలు..

    హైదరాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి గెలుపు లాంఛనమైంది. దీంతో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్‌లో సంబరాలు మొదలయ్యాయి. నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • 20 Mar 2021 05:10 PM (IST)

    హైదరాబాద్‌ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతోపాటు నల్లగొండ స్థానంలో బీజేపీ నాలుగో స్థానంలో నిలిచింది.

  • 20 Mar 2021 05:07 PM (IST)

    వాణీదేవి గెలుపు లాంఛనమే.. మరికాసేపట్లో ప్రకటన..

    హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు లాంఛనంగా మారింది.  వాణీదేవికి ఒక లక్ష 49 వేల 269 ఓట్లు (149269) రాగా.., బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు ఒక లక్షా 37 వేల 566 (137566) ఓట్లు వచ్చాయి. వాణీదేవికి మెజారిటీ 11703 ఓట్లు ఉన్నాయి.

  • 20 Mar 2021 05:02 PM (IST)

    మరికాసేపట్లో ప్రకటన..

    హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి రెండో ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. మరికాసేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

  • 20 Mar 2021 05:01 PM (IST)

    హైదరాబాద్ స్థానంలో వాణీదేవి విజయం..

    హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై ఆమె విజయం సాధించారు.

  • 20 Mar 2021 04:51 PM (IST)

    వెనుదిరిగిన బీజేపీ ఏజెంట్లు

    వాణీదేవి గెలుపు దిశగా పయనిస్తుండటంతో.. సరూర్‌నగర్ సెంటర్ నుంచి బీజేపీ ఏజెంట్లు వెనుదిరిగారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి కే.నాగేశ్వర్ ఎలిమినేషన్ అయ్యారు. దీంతో 93 అభ్యర్థుల్లో ఎలిమినేషన్ అయిన వారి సంఖ్య 91కి చేరింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి 1,68,520 ఓట్లు రావాల్సి ఉంటుంది.

  • 20 Mar 2021 04:48 PM (IST)

    గెలుపు దిశగా వాణీదేవి..

    హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో వాణీదేవి మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో రామచంద్రరావు కొనసాగుతున్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి.

  • 20 Mar 2021 04:44 PM (IST)

    స్వతంత్ర అభ్యర్థి కె.నాగేశ్వర్‌ ఎలిమినేషన్

    స్వతంత్ర అభ్యర్థి కె.నాగేశ్వర్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా పూర్తియింది. ప్రస్తుతం సురభి వాణీదేవి మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో రామచంద్రరావు కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి 1,68,520 ఓట్లు రావాల్సి ఉంటుంది.

  • 20 Mar 2021 04:41 PM (IST)

    హైదరాబాద్ స్థానంలో 90 ఎలిమినేషన్..

    హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో ఇప్పటివరకు మొత్తం 93 మంది అభ్యర్థుల్లో 90 మంది ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. దీంట్లో తెరాస అభ్యర్థి సురభి వాణిదేవికి 15,321 ఎలిమినేషన్‌ ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు 14,530, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌కు 13,773 చొప్పున ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు పడిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే.. సురభి వాణీదేవికి 1,28010 ఓట్లు రాగా.. రామచంద్రరావుకు 1,19,198 ఓట్లు, కె.నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు వచ్చాయి.

  • 20 Mar 2021 04:12 PM (IST)

    నల్లగొండ: పూర్తి కావొచ్చిన 68వ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ

    నల్లగొండ స్థానంలో 68వ అభ్యర్థి బీజేపీ ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి కావొచ్చింది. అనంతరం కోదండరాం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  ఎక్కువగా బదలాయింపు ఓట్లు పడినా కోదండరాం రెండో స్థానానికి చేరుకోలేదు. దీంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళి పోయారు.

  • 20 Mar 2021 03:56 PM (IST)

    వారిద్దరి మధ్యే పోటీ..

    ఎలిమినేషన్‌‌కు దూరంగా ఉండి బరిలో ఉండాలంటే మల్లన్న‌ను దాటి 9,801 ఓట్లను కోదండరామ్ సాధించాల్సి ఉంటుంది. బీజేపీ ‌అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి‌కి వచ్చిన 39,107 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు కోదండరామ్‌కు ‌కీలకం కానున్నాయి. కోదండరామ్ ఎలిమినేషన్ అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లన్నమధ్య హోరాహోరీ పోటీ ఉండనుంది.

  • 20 Mar 2021 03:41 PM (IST)

    కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన కోదండరాం

    ప్రొఫెసర్ కోదండరామ్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పోటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లన్న ఉన్నారు. దీంతో కౌంటింగ్ సెంటర్ నుంచి కోదండరాం వెళ్లిపోయారు.

  • 20 Mar 2021 03:38 PM (IST)

    మరికాసేపట్లో తేలనున్న కోదండరాం భవితవ్యం

    నల్గగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కోదండరామ్ భవితవ్యం మరి కాసేపట్లో తేలిపోనుంది. కోదండరామ్‌కు ఎక్కువ ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌కు చేరువలో ఉన్నారు.

  • 20 Mar 2021 02:20 PM (IST)

    ఎలిమినేషన్‌ అభ్యర్థి ఓట్లపై ఆశలు

    తెలంగాణ పట్టభద్రుల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న కౌంటింగ్‌ ఇంకా సమయం పట్టే అవకాశాలున్నాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయన ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు మల్లన్న, కోదండరామ్‌.

  • 20 Mar 2021 02:11 PM (IST)

    కీలకం కానున్న బీజేపీ అభ్యర్థి ఓట్లు

    ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈ అభ్యర్థి 42,015 ఓట్లు బదలాయింపు కీలకం కానున్నాయి. 23,432 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌ ఉన్నారు. మల్లన్న, కోదండరామ్‌ మధ్య 9,800 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఒక వేళంకోదండరామ్‌కు ఓట్లు పెరిగితే మల్లన్న ఎలిమినేషన్‌ కానున్నారు.

  • 20 Mar 2021 02:09 PM (IST)

    ఉత్కంఠగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

    తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి బదలాయింపు ఓట్ల పై మల్లన్న, కోదండరామ్ ఆశలు పెట్టుకున్నారు.

  • 20 Mar 2021 12:55 PM (IST)

    తొలి ప్రాధాన్యం + రెండో ప్రాధాన్యంతో కలిపి వచ్చిన ఓట్ల వివరాలు

    ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యంతో కలిపి ఇప్పటి వరకు వచ్చిన ఓట్ల వివరాలు

    పల్లా రాజేశ్వర్‌- 1,10,840+11799= 1,22,639 మల్లన్న – 83,290+15,917 = 99,207 కోదండరాం – 70,072+ 19,335 = 89,407 23,432 ఓట్లతో పల్లా రాజేశ్వర్‌ ఆధిక్యంలో ఉన్నారు.

  • 20 Mar 2021 12:49 PM (IST)

    ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌: నల్లగొండ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ అప్డేట్…

    ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 68 వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమిట్ అయ్యారు. ఆయన ఓట్లను ఇతర అభ్యర్థులకు జమ చేశారు. పల్లా రాజేశ్వర్‌కు 5,253 తీన్మార్ మల్లన్నకు -7,349 కోదండరాం- 10,297 ఓట్లు వచ్చాయి.

  • 20 Mar 2021 11:34 AM (IST)

    ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్‌డేట్స్‌

    ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 67 వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు

    పల్లా రాజేశ్వర్‌ (టీఆర్‌ఎస్‌ అభ్యర్థి)- 1180 తీన్మార్‌ మల్లన్న మల్లన్న (స్వతంత్ర అభ్యర్థి)- 1750 కోదండరామ్ (టీజేఏసీ అభ్యర్థి) -2363

    మొత్తం ఓట్లు… పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్)1,18,566. తీన్మార్ మల్లన్న (స్వతంత్ర్య అభ్యర్థి). 93,608 మల్లన్న కోదండరాం (టీజేఎస్)81,472 సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై పల్లా రాజేశ్వర రెడ్డి 24,958 ఓట్ల ఆధిక్యం ఉన్నారు.

  • 20 Mar 2021 10:29 AM (IST)

    తొలి ప్రాధాన్యంలో గెలుపు కోటా ఓట్లు రాకుంటే..

    తొలి ప్రాధాన్యంలో గెలుపు కోటా ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు పొందిన వారిని గుర్తిస్తారు. తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థుల రెండో ప్రాధాన్యం ఓట్లు గుర్తిస్తారు. రెండో ప్రాధాన్యం ఓట్లను గుర్తించి ఆ అభ్యర్థికి ఓట్లను జమ చేస్తారు. క్రమంగా తక్కువ ఓట్ల అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి తొలగింపు జరుగుతుంది.

  • 20 Mar 2021 10:28 AM (IST)

    కౌంటింగ్‌లో ఎలిమినేషన్‌ ఇలా..

    అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో తొలగింపు జాబితా. జాబితా ఆధారంగా అభ్యర్థులకు సమాచారం, ఆ తర్వాత ఎలిమినేషన్‌ చేశారు. నల్గొండ స్థానం 66 మంది ఎలిమినేషన్‌ అయ్యారు. హైదరాబాద్‌ స్థానంలో 86 మంది ఎలిమినేషన్‌ అయ్యారు

  • 20 Mar 2021 10:24 AM (IST)

    ఎవరికి ఎన్ని ఓట్లు

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  ఇప్పటి వరకు టీఆర్ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,19,619 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,10,500 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ. నాగేశ్వర్‌కు 59,648 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 36,726 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో 89 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. 9,119 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ముందంజలో ఉన్నారు.

  • 20 Mar 2021 09:05 AM (IST)

    నల్గొండ– ఖమ్మం– వరంగల్‌ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత

    పోటీ చేసిన అభ్యర్థులు – 71 మొత్తం ఓట్లు – 5,05,565 పోలైన ఓట్లు- 3,87,969 చెల్లని ఓట్లు- 21,636 చెల్లిన ఓట్లు -3,66,333 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు -1,83,167 పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌)- 1,10,840 (30.25 శాతం) తీన్మార్‌ మల్లన్న (స్వతంత్ర) -83,290 (22.73 శాతం) కోదండరాం (టీజేఎస్‌)- 70,072 (19.12 శాతం) గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ)- 39,107 (10.67శాతం) రాములు నాయక్‌(కాంగ్రెస్‌)- 27,588 (7.53 శాతం)

  • 20 Mar 2021 09:04 AM (IST)

    తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత

    హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పోటీ చేసిన అభ్యర్థులు – 93 మొత్తం ఓట్లు – 5,31,268 పోలైన ఓట్లు – 3,58,348 చెల్లని ఓట్లు- 21,309 చెల్లిన ఓట్లు – 3,37,039 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు -1,68,520 ఎస్‌.వాణిదేవి (టీఆర్‌ఎస్‌)- 1,12,689 (33.43 శాతం) ఎన్‌.రాంచందర్‌రావు (బీజేపీ) -1,04,668 (31 శాతం) కె.నాగేశ్వర్‌ (స్వతంత్ర)- 53,620 (15.9 శాతం) చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) -31,554 (9.36 శాతం)

  • 20 Mar 2021 09:02 AM (IST)

    కౌంటింగ్‌ పూర్తికి ఇంకా సమయం

    తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి కౌంటింగ్‌ కొనసాగుతున్నప్పటికీ తుది ఫలితం ఇంకా తేలనేలేదు. దీంతో అటు అభ్యర్థులు, ఇటు పార్టీల కేడర్‌ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. తుది ఫలితం తేలడానికి ఇంకా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు చెబుతున్నారు.

  • 20 Mar 2021 07:17 AM (IST)

    86 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 86 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. 8,478 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఉన్నారు. ఫలితాలు వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

  • 20 Mar 2021 06:52 AM (IST)

    కొనసాగుతున్న నాలుగో రోజు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

    హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నాలుగో రోజు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టత రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,15,043 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,06,565 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ. నాగేశ్వర్‌కు 55,742, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 32,879 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో 86 మంది ఎలిమినేషన్‌ అయ్యారు.

  • 19 Mar 2021 10:05 PM (IST)

    హైదరాబాద్ స్థానంలో.. ముందంజలోనే టీఆర్ఎస్ అభ్యర్థి

    హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో.. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 1,12,921 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావుకు 1,04,885 ఓట్లు, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ రావుకు 53,747 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,669 ఓట్లు వచ్చాయి. విజయానికి 1,68,520 ఓట్లు అవసరం ఉంది.

  • 19 Mar 2021 10:01 PM (IST)

    రెండో ప్రాధాన్యం ఓట్లల్లోనూ వాణీ దేవినే..

    రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థికి వాణీ దేవికి 232 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావుకు 217 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 137 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 115 ఓట్లు జమయ్యాయి.

  • 19 Mar 2021 09:58 PM (IST)

    హైదరాబాద్ స్థానంలో 49 మంది అభ్యర్థుల ఎలిమినేషన్

    హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు 49 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు.

  • 19 Mar 2021 09:55 PM (IST)

    నల్లగొండలో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

    రెండో ప్రధాన్యం ఓట్ల లెక్కింపులో.. పల్లా రాజేశ్వర్ రెడ్డి -1,10,840 + 415 = 1,11,255 తీన్మార్ మల్లన్న – 83,290+387 =83,677 కోదండరాం – 70,072+461 = 70,533 ప్రస్తుతం.. పల్లా రాజేశ్వర్ రెడ్డి 27,578 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

  • 19 Mar 2021 09:53 PM (IST)

    పల్లాకే ఆధిక్యం..

    నల్లగొండ స్థానంలో 56 మంది ఎలిమినేషన్ అనంతరం.. రెండో ప్రాధాన్యత ఓట్లల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 415, తీన్మార్ మల్లన్నకు 387, కోదండరాంకు 461 ఓట్లు వచ్చాయి.

  • 19 Mar 2021 09:51 PM (IST)

    నల్లగొండ స్థానంలో 56 మంది ఎలిమినేషన్

    వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేస్తున్నారు.

  • 19 Mar 2021 08:44 PM (IST)

    నల్లగొండలో 55 మంది ఎలిమినేషన్

    నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 55 మంది ఎలిమినేషన్ అయ్యారు.

  • 19 Mar 2021 07:53 PM (IST)

    హైదరాబాద్ స్థానంలో.. 37 మంది ఎలిమినేషన్

    హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఈ స్థానంలో ఇప్పటివరకు తక్కువ ఓట్లు వచ్చిన 37 మంది అభ్యర్థులను ఎలిమినేషన్‌ చేశారు. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

  • 19 Mar 2021 07:42 PM (IST)

    హైదరాబాద్ స్థానంలో ప్రస్తుతం.. ఓట్లు ఇలా..

    వాణీదేవికి 1,12,802 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావుకు 1,04, 765 ఓట్లు, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ రావుకు 53,677 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,602 ఓట్లు వచ్చాయి. విజయానికి 1,68,520 ఓట్లు అవసరం ఉంది.

  • 19 Mar 2021 07:22 PM (IST)

    ఆధిక్యంలోనే కొనసాగుతున్న వాణీదేవి

    ఇప్పటివరకూ టీఆర్‌ఎస్ అభ్యర్థికి వాణీ దేవికి 113 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావుకు 97 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 67 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 48 ఓట్లు జమయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి బీజేపీ అభ్యర్థి రాంచంద్‌రావుపై 8,037 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 19 Mar 2021 07:18 PM (IST)

    హైదరాబాద్ స్థానంలో.. 30 మంది ఎలిమినేషన్

    హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటివరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన 30 మందిని ఎలిమినేషన్‌ చేశారు.

  • 19 Mar 2021 07:15 PM (IST)

    ఆధిక్యంలోనే కొనసాగుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి

    ఇందులో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 316, తీన్మార్ మ‌ల్లన్నకు 296, కోదండ‌రాంకు 333 ఓట్లు జ‌మ అయ్యాయి. తొలి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యంతో కలిపి అభ్యర్థులకు ఓట్లను జమ చేస్తున్నారు. ఇప్పటివరకూ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొత్తం 1,11,156 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు 83,586, కోదండరాంకు 70405 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు అవసరముంది.

  • 19 Mar 2021 07:12 PM (IST)

    నల్లగొండలో.. 52 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

    వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 52 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేస్తున్నారు.

  • 19 Mar 2021 04:26 PM (IST)

    కొనసాగుతున్న రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు

    వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నల్లగొండ ఎన్నికల్లో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటివరకు 40 మందిని ఎలిమినేషన్‌ చేశారు.

  • 19 Mar 2021 04:22 PM (IST)

    నల్లగొండలో.. 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

    వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 40 మంది వరకు ఎలిమినేషన్‌ అయ్యారు. ఎలిమినేషన్‌ అయిన అభ్యర్థుల ఓట్లు తొలి మూడు స్థానాల్లోని అభ్యర్థులకు జమ చేయనున్నారు.

  • 19 Mar 2021 01:55 PM (IST)

    తేలని ఫలితం.. కొనసాగుతోన్న ఉత్కంఠ

    ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏడో రౌండ్‌ పూర్తయ్యే సరికి సురభి వాణీదేవికి 1, 12, 689 ఓట్లు, రామచంద్రరావుకు 1, 04, 668 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 53, 610 ఓట్లు, చిన్నారెడ్డి కి 31, 554 ఓట్లు వచ్చాయి. అయితే మొదటి ప్రాధాన్యతలో టీఆర్ఎస్ లీడ్ – 8,021 ఓట్లు ఉండగా, మొత్తం చెల్లని ఓట్లు- 21, 309 వచ్చాయి.

  • 19 Mar 2021 01:51 PM (IST)

    ఇప్పటి వరకు 36 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌

    నల్లొండ: పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకు 36 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. ఎలిమినేషన్‌ అయిన అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 144 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 132 ఓట్లు, కోదండరామ్‌కు 143 ఓట్లు జమ అయ్యారు.

  • 19 Mar 2021 12:15 PM (IST)

    హైదరాబాద్‌: ఏడో రౌండ్ల తర్వాత ఆధిక్యంలో సురభివాణీదేవి

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏడు రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఏడు రౌండ్లలో సురభివాణీదేవికి 1,12,689 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచందరరావుకు 1,04,668, ప్రొ. నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,610 ఓట్లు వచ్చాయి.

  • 19 Mar 2021 11:49 AM (IST)

    33 మంది ఎలిమినేషన్‌

    నల్గొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 33 మంది వరకు ఎలిమినేషన్‌ అయ్యారు. ఎలిమినేషన్‌ అయిన అభ్యర్థుల ఓట్లు తొలి మూడు స్థానాల్లోని అభ్యర్థులకు జమ చేయనున్నారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 124 ఓట్లు జమ కాగా, తీన్మార్‌ మల్లన్నకు 115 ఓట్లు, కోదండరామ్‌కు 127 జమ అయ్యాయి.

  • 19 Mar 2021 11:06 AM (IST)

    మొదటి ప్రాధాన్యతలో ఎవ్వరికి రాని మ్యాజిక్‌ ఫిగర్‌

    తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు మూడో రోజు కొనసాగుతోంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి గెలుపునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికి స్పష్టతమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒక వేళ ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే ఎక్కువ ఓట్ల వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.

  • 19 Mar 2021 11:01 AM (IST)

    ముందంజలో వాణీదేవి

    హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో పూర్తయిన ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉత్కంఠగా సాగుతోంది. ఆరో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై 7,626 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

  • 19 Mar 2021 10:58 AM (IST)

    28 మంది ఎలిమినేషన్‌

    నల్గొండలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ లెక్కింపులో ఇప్పటి వరకు 28 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. ఎలిమినేషన్‌ అయిన అభ్యర్థుల ఓట్లు తొలి మూడు స్థానాల్లోని అభ్యర్థులకు జమ చేశారు

  • 19 Mar 2021 10:36 AM (IST)

    27 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

    తెలంగాణ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో 27 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. అయితే మొదటి ప్రాధాన్యతలో 50 శాతం ఓట్లు ఎవ్వరికి దక్కలేదు.ఇక రెండు ప్రాధాన్యతలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

  • 19 Mar 2021 09:53 AM (IST)

    ఎవరికి ఎన్ని రావాలి..

    ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మూడో రోజు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పల్లా రాజేశ్వర్‌ గెలుపొందాలంటే 72,327 ఓట్లు రావల్సి ఉండగా, తీన్మార్‌ మల్లన్నకు 99,877 ఓట్లు, కోదండరామ్‌కు 1,13,095 ఓట్లు కావాల్సి ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్‌కు 1,10,840, తీన్మార్​మల్లన్నకు 83,290, కోదండరాంకు 70,072 ఓట్లు వచ్చాయి.

  • 19 Mar 2021 09:07 AM (IST)

    మూడో రోజు ప్రారంభమైన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

    తెలంగాణ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు మూడో రోజు రెండు ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరో 36 గంటల తర్వాతే తేలనున్న ఫలితం. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం రాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు సిబ్బంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో 15 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. 252 ఓట్ల మాత్రంమే 15 మంది అభ్యర్థులు సాధించారు.

  • 19 Mar 2021 09:01 AM (IST)

    రెండో స్థానంలో తీర్మార్‌ మల్లన్న

    తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుల్లో భాగంగా తీర్మార్‌ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. గెలుపు కోసం రావాల్సిన 1,83,168 ఓట్లు.

  • 19 Mar 2021 08:59 AM (IST)

    మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి

    తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 1,10,840 ఓట్లతో మొదటి స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉండగా, 83,290 ఓట్లతో రెండో స్థానంలో తీర్మార్‌ మల్లన్న ఉన్నారు. 70,072 ఓట్లతో మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. 39,107 ఓట్లతో నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి ఉన్నారు.

  • 19 Mar 2021 08:41 AM (IST)

    ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో సురభి వాణీదేవి ముందంజ

    మరోవైపు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవీ ముందంజలో ఉన్నారు. ఐదో రౌండ్లలో వాణీ దేవికి 88,304 ఓట్లు పోలవగా.. 6,555 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 81,749 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్ రావు రెండో స్థానంలో ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు రూ. 42,604 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు నమోదు అయ్యాయి. టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 4,656 ఓట్లు పోలయ్యాయి. ఇక ఐదు రౌండ్లలో 16,712 ఓట్లు నోటాకు పోలవడం విశేషం.

  • 19 Mar 2021 08:39 AM (IST)

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలంటే..

    తెలంగాణ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలంటే 1,83,168 ఓట్లు పోలవ్వాల్సి ఉంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అంతమేర ఓట్లు ఎవరికీ పోలవకపోవడంతో.. అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. తుది ఫలితం తేలేందుకు మరో 36 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

  • 19 Mar 2021 08:38 AM (IST)

    కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఎవరికి ఎన్ని

    నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 1,10,840 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తరువాత రెండో స్థానంలో 83,290 ఓట్లతో తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో నిలిచారు. కోదండరాంకు ఇప్పటి వరకు 70,072 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నపై పల్లా రాజేశ్వర్ రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 19 Mar 2021 02:05 AM (IST)

    ఆరు రౌండ్లు ముగిసేసరికి పల్లా రాజేశ్వర రెడ్డికి 22,843 ఓట్ల ఆధిక్యత..

    నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా ఆరో రౌండ్‌ పూర్తయింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 22,843 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లాకు పోలైన మొత్తం 95,317 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఆరో రౌండ్‌లో పల్లా రాశేశ్వర్‌ రెడ్డికి 16,204 ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అతనికి 72,474 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఆయనకు 59,705 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లని ఓట్లు 15, 533. ఆరో రౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 11,910 ఓట్లు రాగా… కొదండరామ్‌కు 10,505 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 5,237 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,994 ఓట్లు దక్కాయి.

  • 18 Mar 2021 10:34 PM (IST)

    గెలిచినా, ఓడినా ప్రజలతోనే : బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు

    తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో వాణీదేవి ముందంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో ఉన్నారు. ఫలితంపై రామచంద్రరావు మాట్లాడుతూ తాను గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంకా చాలా రౌండ్లు మిగిలే ఉన్నాయని, తప్పకుండా తనకు మెజారిటీ వస్తుందని, విజయం సాధిస్తానని ఆయన ధీమాగా ఉన్నారు.

  • 18 Mar 2021 10:25 PM (IST)

    డిగ్రీలు చదివిన వాళ్ల ఓటింగ్ లోనూ భారీగా చెల్లని ఓట్లు.!

    సాధారణ ఎన్నికల్లో చెల్లని ఓట్లు రావడం సహజం. వృద్ధులు, నిరక్షరాస్యుల విషయంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే, విచిత్రంగా ప్రస్తుతం జరుగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెల్లని ఓట్లు భారీగా వస్తున్నాయి. ప్రతీ రౌండ్ లోనూ వీటి సంఖ్య పెరుగుతూనే వస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దాదాపు ప్రతీ రౌండ్‌లోనూ 3 వేలకుపైగా చెల్లని ఓట్లు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక, హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా పోరు నడుస్తుండగా, నల్గొండలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ తీన్మార్‌ మల్లన్నగా పోటీ సాగుతోంది.

  • 18 Mar 2021 10:15 PM (IST)

    ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం

    జంబో బ్యాలెట్‌ కారణంగా తెలంగాణ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉంది. సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు శుక్రవారం అర్థరాత్రికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తవ్వడానికి మరో 24 గంటలు పట్టే అవకాశం ఉంది.

  • 18 Mar 2021 09:13 PM (IST)

    ఐదు రౌండ్లు ముగిసేసరికి పల్లా రాజేశ్వర రెడ్డికి 18,549 ఓట్ల ఆధిక్యత

    నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఐదో రౌండ్‌ పూర్తయింది. ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 18,549 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లాకు పోలైన మొత్తం ఓట్లు 79,113. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అతనికి 60,564 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఆయనకు 49,200 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లని ఓట్లు 15, 533.

  • 18 Mar 2021 09:00 PM (IST)

    3వ రౌండ్‌ తర్వాత వాణీదేవికి 4,444 ఓట్ల ఆధిక్యత

    మహబూబ్‌నగర్‌ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 3వ రౌండ్ ముగిసే స‌రికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్‌లో వాణీదేవికి 17,836 ఓట్లు ల‌భించడంతో మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు వాణీదేవికి మొత్తం 53,007 ఓట్లు పోల‌య్యాయి. సమీప ప్రత్యర్థి రాంచందర్ రావు కు 48,563 ఓట్లు , ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు 25,505 ఓట్లు, చిన్నారెడ్డికి 10,035 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌ తర్వాత వాణీదేవి 4,444 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 18 Mar 2021 07:13 PM (IST)

    4వ రౌండ్ లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా ఆధిక్యం

    నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో నాల్గొవ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాల్గొవ రౌండ్‌లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 4వ రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,897 ఓట్లు పోలవ్వగా సమీప అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 12,146, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 10,048 ఓట్లు వచ్చాయి. ఇక, మిగతా అభ్యర్థులు ప్రేమేందర్‌రెడ్డి(బీజేపీ)కి 5,099, రాములు నాయక్‌(కాంగ్రెస్‌)కు 4,003 ఓట్లు పోలయ్యాయి. చెల్ల‌ని ఓట్లు 3,223 గా ఉన్నాయి.

  • 18 Mar 2021 10:43 AM (IST)

    ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. మూడో రౌండ్ కంప్లీట్.. 12 వేల ఓట్లతో పల్లా ముందంజ..

    నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికి 17,393 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు. 13,122 ఓట్లతో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇక 11,907 ఓట్లతో ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం మూడు రౌండ్లు కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డి 12,142 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 18 Mar 2021 10:37 AM (IST)

    మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కొనసాగుతున్న రెండో రౌండ్ కౌంటింగ్

    మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవగా.. రెండో రౌండ్ లెక్కింపు జరుగుతోంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ముందంజలో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్ రావు ఉన్నారు.

  • 18 Mar 2021 07:52 AM (IST)

    పెద్దల పోరులో కారు జోరు.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ దూసుకుపోతున్న టీఆర్ఎస్..

    పెద్దల పోరులో కారు జోరు కొనసాగుతోంది. నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఫస్ట్‌ రౌండ్‌లో సత్తా చాటిన పల్లా.. రెండో రౌండ్‌లోనూ అదే రిపీట్ చేస్తున్నారు. సెకండ్ రౌండ్‌లో మొత్తం 56వేల 3 ఓట్లలో .. పల్లాకు 15 వేల 857 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 12 వేల 70 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. థర్డ్‌ ప్లేస్‌లో కోదండరామ్‌కు 9,448 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669 ఓట్లతో ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పల్లా 3,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఖమ్మం- వరంగల్‌- నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 16వేల 130 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి 12వేల 46 ఓట్లు.. కోదండరామ్‌కు 9వేల 80 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి నాలుగు, కాంగ్రెస్ క్యాండెట్‌ రాములు నాయక్‌ ఐదో స్థానంలో కొనసాగారు. రెండో రౌండ్‌లోనూ మళ్లీ పల్లానే ఫస్ట్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

    ఖమ్మం వరంగల్‌ నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం 3 లక్షల 85వేల 996 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న ఈ ఫలితాల్లో.. ఓక్కో రౌండ్‌లో 56,000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఫస్ట్‌, సెకండ్‌ రౌండ్లలో 56 వేల 3 ఓట్లను లెక్కించారు. దాదాపు నాలుగువేల చెల్లని ఓట్లను అధికారులు గుర్తించి పక్కనపడేశారు.

    మరోవైపు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 17 వేల 429 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 16,385, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు 8,357, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,101 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి సమీప బీజేపీ అభ్యర్థిపై వెయ్యి 44 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొత్తం ఎనిమిది హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఒక్కో హాల్‌లో ఏడు టేబుళ్లు, ఒక్కో టేబుల్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో లెక్కింపు నిర్వహించనుండగా.. ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్లు కౌంట్‌‌ చేస్తున్నారు. ఒక్కో రౌండ్‌కి దాదాపు నాలుగు గంటలు సమయం పడుతుంది. మూడు షిప్టుల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

  • 18 Mar 2021 07:46 AM (IST)

    నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. పూర్తయిన రెండో రౌంట్ ఓట్ల లెక్కింపు..

    నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండో రౌండ్‌లో 15,857 ఓట్లతో తొలి స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. 12,070 ఓట్లతో రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న, 9,448 ఓట్లతో మూడో స్థానంలో కోదండరాం, 6,669 ఓట్లతో నాల్గో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఉన్నారు. కాగా, రెండు రౌండ్లు కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డి 7,871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 18 Mar 2021 07:44 AM (IST)

    హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ముందంజలో సురభి వాణీదేవి..

    హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతం రెండో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవీకి 17,439 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు కు 16,385 ఓట్లు పోలయ్యాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు 8,357 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,082 ఓట్లు పోలయ్యాయి.

  • 18 Mar 2021 06:27 AM (IST)

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా.. 4084 ఓట్ల ఆధిక్యం..

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై 4084 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ లెక్కింపు పర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 16,130 ఓట్లు పోలవగా.. తీన్మార్ మల్లన్నకు – 12,046 ఓట్లు, కోదండరాం – 9080, బీజేపీ – 6,615, కాంగ్రెస్ – 4,354, చెల్లని ఓట్లు – 2,789 పోలయ్యాయి. మొదటి రౌడ్‌లో 56,000 ఓట్లను లెక్కించారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

  • 17 Mar 2021 09:53 PM (IST)

    సగానికి పైగా ఆధిక్యంలో దూసుకెళుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి

    తొలి రౌండ ఓట్ల లెక్కింపులో.. చెల్లిన 45,000 ఓట్లలో పల్లా రాజేశ్వరరెడ్డి 26,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

    రెండవ స్థానంలో కోదండరాం, మూడవ స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు.

  • 17 Mar 2021 09:49 PM (IST)

    తొలి రౌండ్లో.. చెల్లని ఓట్లు 8 వేలు

    ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 56 వేల ఓట్లలో చెల్లనవి 8,000 గా అధికారులు ప్రకటించారు. 45వేల ఓట్లు చెల్లాయి.

  • 17 Mar 2021 09:47 PM (IST)

    నల్లగొండ స్థానం.. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి..

    ముందంజలో కొనసాగుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి.. సగానికి పైగా ఓట్లతో దూసుకువెళుతున్న పల్లా

  • 17 Mar 2021 07:02 PM (IST)

    ఏడు రౌండ్లల్లో…

    ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్ల చొప్పున ఓట్లను లెక్కించనున్నారు.  రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

  • 17 Mar 2021 07:00 PM (IST)

    నల్లగొండ స్థానానికి ప్రారంభమైన తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు

    వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల తొలిరౌండ్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

  • 17 Mar 2021 05:54 PM (IST)

    వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే..?

    వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానానికి మొత్తం 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపునకు దాదాపు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గురువారం ఉదయం తర్వాతే ముందు వరుసలో ఉన్న అభ్యర్థులపై స్పష్టతరానుంది.

  • 17 Mar 2021 05:45 PM (IST)

    కాసేపట్లో ప్రారంభం కానున్న తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు..

    సాయంత్రం 7.30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశముంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం ఏడు రౌండల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అనంతరం చెల్లని ఓట్ల సంఖ్యపై నిర్ధారణ, గెలుపు కోటాపై స్పష్టత రానుంది.

  • 17 Mar 2021 05:30 PM (IST)

    పూర్తయిన బండిలింగ్ ప్రక్రియ

    వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపునకు బండిలింగ్ ప్రక్రియ పూర్తయింది. సాయంత్రం 6 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

  • 17 Mar 2021 05:28 PM (IST)

    పూర్తయిన బండిలింగ్ ప్రక్రియ

    వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపునకు బండిలింగ్ ప్రక్రియ పూర్తయింది. సాయంత్రం 6 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

  • 17 Mar 2021 01:34 PM (IST)

    కౌంటింగ్‌ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఆందోళన

    తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. సరూర్‌ నగర్‌లో జరుగుతున్న కౌంటింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేయకపోడంతో ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.

  • 17 Mar 2021 01:29 PM (IST)

    బ్యాలెట్‌ బాక్సులకు నో సీల్‌

    తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేయలేదంటూ సరూర్‌నగర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఏజంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 8 బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌, తాళాలు లేవంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కౌంటింగ్‌ ఏజంట్లను పోలీసులు సముదాయిస్తున్నారు. ఈ విషయమై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

  • 17 Mar 2021 12:59 PM (IST)

    నల్గొండలో కొనసాగుతున్న కౌంటింగ్‌

    తెలంగాణ రాష్ట్ర రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో కొనసాగుతుండగా, ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు బండిల్స్‌ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండగా, ఈ ఫలితాలు రాత్రి 9 గంటల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  • 17 Mar 2021 11:56 AM (IST)

    కొనసాగుతున్న కౌంటింగ్‌

    తెలంగాణలో రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు కౌంటింగ్‌ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు నుంచి ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, అలాగే వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానాలకు ఈ కౌంటింగ్‌ కొనసాగుతోంది. కాగా, ఫలితాలపై స్పష్టం బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం రానున్నాయిన అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 17 Mar 2021 10:16 AM (IST)

    ఓట్ల లెక్కింపు ఇలా..

    కౌంటింగ్‌ కోసం ఒక్కో హాలులో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు 1000 చొప్పున 56వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్‌ చేశాక, ఒక్కోటేబుల్‌కు 1000 ఓట్లు (40) బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌లో 56వేల ఓట్లను లెక్కించనుండగా, మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, తొలి ప్రాధాన్యత ఓట్ల ఫలితం 18 న ఉదయం 8 గంటలకు గానీ తేలదని అంటున్నారు.

  • 17 Mar 2021 09:57 AM (IST)

    ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ఫలితాలు

    ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్‌తో పాటు జంబో బ్యాలెట్‌తో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్​తో పాటు జంబో బ్యాలెట్​తో కౌంటింగ్​ సవాల్​గా మారింది. దీంతో ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

  • 17 Mar 2021 09:51 AM (IST)

    కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో 3,57,354 ఓట్లు పోల్‌ కాగా, వాటిని సరూర్‌నగర్‌లో లెక్కిస్తు్ండగా, వరంగల్‌- ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పోల్‌ అయిన 3,86,320 ఓట్లను నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో లెక్కిస్తున్నారు.

  • 17 Mar 2021 09:38 AM (IST)

    సరూర్‌నగర్‌ స్టేడియం వద్ద సందడి

    సరూర్‌ నగర్‌లోని ఇండోర్‌ స్టేడియం వద్ద సందడి నెలకొంది. ఓట్ల లెక్కింపు మొదలు కావడంతో స్టేడియానికి ఏజెంట్లు, అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

  • 17 Mar 2021 09:24 AM (IST)

    రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో లెక్కింపు

    ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను తీసుకువచ్చి బండల్స్‌ కడుతున్నారు

  • 17 Mar 2021 09:22 AM (IST)

    ప్రారంభమైన కౌంటింగ్‌

    తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది.

Published On - Mar 21,2021 7:29 PM

Follow us
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!