Etela Comments : ఈటల నర్మగర్భ వ్యాఖ్యలు, ‘తాను ఇబ్బంది పడుతుండొచ్చు…గాయపడుతుండొచ్చు.. కానీ మనసు మార్చుకోలేదు’
Etela Comments : ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు..కానీ శాశ్వతంగా ఓడిపోదు. కులం, డబ్బు, పార్టీ జెండాకాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి...
Etela Comments : ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు..కానీ శాశ్వతంగా ఓడిపోదు. కులం, డబ్బు, పార్టీ జెండాకాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి. ఏంటీ వేదాంతం అనుకుంటున్నారా..అవును… వేదాంతమే. ఈ మధ్య మంత్రి ఈటల రాజేందర్ నోటినుంచి ఇలాంటి మాటలే వస్తున్నాయి. తాజాగా మళ్లీ కరీంనగర్ జిల్లాలో వేదాంత ధోరణితోనే.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడారు మంత్రి ఈటల. ఓ వైపు అభివృద్ధి అంటూ..కులం, డబ్బు ప్రమేయంపై ప్రస్తావించారాయన.
పెట్టింది చెప్పుకోవద్దు..చేసిందంతా చెప్పుకోవద్దన్నారు ఈటల. అక్కడితోనే ఆగలేదాయన. తాను ఇబ్బంది పడుతుండొచ్చు…గాయపడుతుండొచ్చుకానీ మనసు మార్చుకోలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పెట్టే చెయ్యి ఆగదు..చేసే మనిషిని నేను అస్సలు ఆగనంటూ భావోద్వేగంతో మాట్లాడారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనను ఎంత గొప్పగా తీసుకెళ్లారో మరిచిపోనన్న ఈటల.. తానున్నంతవరకు తనవాళ్లున్నంతవరకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానని మనసువిప్పి చెప్పారు.
Read also : BJP manifesto for Bengal elections: బెంగాల్ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రజలకు వరాలు ప్రకటించిన బీజేపీ