BJP manifesto for Bengal elections: బెంగాల్ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రజలకు వరాలు ప్రకటించిన బీజేపీ
BJP manifesto for Bengal elections : భారతీయ జనతాపార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా..
BJP manifesto for Bengal elections : భారతీయ జనతాపార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మేనిఫెస్టోని ఆదివారం రాత్రి రిలీజ్ చేశారు. కోల్ కతాలోని పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్, బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి కైలాష్ వర్గీయ సహా పలువురు బీజేపీ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తమ మేనిషెస్టోని “సంకల్ప్ పత్ర”గా పిలవాలని తాము నిర్ణయించామని, ఇది కేవలం మేనిఫెస్టో కాదని..బెంగాల్ కి దేశంలోని అతిపెద్ద పార్టీ రాసే మార్పు లేఖ అని అమిత్ షా ఈ సందర్భంలో చెప్పుకొచ్చారు.
మేనిఫెస్టోలో కీలక అంశాలు చూద్దాం : > మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు > కేజీ నుంచి పీజీ వరకు ఆడపిల్లలకు ఉచిత విద్య > బెంగాల్ లోకి చొరబాటుదారులను అనుమతించకూడదని నిర్ణయం > బెంగాల్ సరిహద్దు ఫెన్సింగ్ బలోపేతం > పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కొనసాగింపు > రూ.18,000 చొప్పున 75 లక్షల రైతులకు అకౌంట్లలో జమ > మెదటి కేబినెట్ లోనే సీఏఏని అమలుపై నిర్ణయం > 70ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న శరణార్థులకు పౌరసత్వం > 5 ఏళ్ల పాటు ఏటా రూ.10,000 చొప్పున ఒక్కో శరణార్థి కుటుంబానికి సాయం > ఉత్తర బెంగాల్, జంగల్ మహల్, సుందర్భాన్ లో మూడు కొత్త ఎయిమ్స్ హాస్పిటల్స్ > అవినీతికి తావులేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కామన్ ఎలిజిబులిటీ టెస్ట్(CET) > ఆయుధాల రాకెట్టు, మాదకద్రవ్యాల వ్యాపారం, భూ కబ్జా, నకిలీ కరెన్సీ సర్క్యులేషన్ మరియు పశువుల అక్రమ రవాణా సమస్యలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ > కళ, సాహిత్యం ఇతర రంగాలను ప్రోత్సహించేందుకు రూ. 11,000 కోట్ల విలువైన సోనార్ బంగ్లా నిధి > రాజకీయ హత్యల కేసులను దర్యాప్తు చేయడానికి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక సిట్ > పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసకు గురైన ప్రతి ఒక్క భాధితులకి పునరావాస ప్యాకేజీగా రూ .25 లక్షలు > ఐక్యరాజ్యసమితిలో బెంగాలీని అధికారిక భాషలలో ఒకటిగా మార్చడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తాం > కృషక్ సురక్ష యోజన కింద భూమిలేని రైతులకు రూ.4,000 ఆర్థిక సాయం
Read also : Telangana Politics : తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులు తీసుకొచ్చిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు